అల వైకుంఠపురములో టీజర్ మొత్తానికి బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం. ముందుగా చిత్రంలోని పాటలను (లిరికల్)
విడుదల చేస్తూ వచ్చిన యూనిట్ ఎట్టకేలకు బన్నీ అభిమానులకు టీజర్ ద్వార ట్రీట్ ఇచ్చింది.
‘మీ నాన్న పెళ్లి కూతురిని దాచినట్టు దాచారు నిన్ను’ అంటూ ఒక సరదా డైలాగుతో మొదలైన చిత్ర టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ‘మీరిప్పుడే కారు దిగారు నేనిప్పుడే క్యారక్టర్ ఎక్క’ చివర్లో బన్నీ చెప్పిన ఈ డైలాగ్ టీజర్ కు హైలైట్.
ఇప్పటికే పాటలతో అల వైకుంఠపురములో చిత్రానికి విశేష స్పందన వచ్చింది. తమన్ అందించిన బాణీలు చాలా బాగున్నాయి ముఖ్యంగా సామజవరగమన పాట యూ ట్యూబ్ లో రికార్దు సృష్టించింది. అల్లు అర్జున్ కోడిపుంజు ఎత్తుకున్న స్టైల్, కొడవలితో బీడీ వెలిగించిన విధానం అభిమానులకు తేగ నచ్చుతుంది అనొచ్చు.