మొదటిసారి బిగ్ బాస్-3 ఎలిమినేషన్ ప్రక్రియలోకి వచ్చిన అలీ రెజా ఫస్ట్ నామినేషన్‌లోనే ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. బలమైన కంటెస్టెంట్ గా భావించిన ఇంటి సభ్యులు అలీ ఎలిమినేట్ అయ్యాడని తెలియగానే అందరూ షాక్ కు గురయ్యారు.
సోషల్ మీడియాలో రెండు రోజులు ముందుగానే అలీ ఎలిమినేట్ అయ్యాడని ఒక వార్త లీక్ అయింది, అయితే ఆ వార్తే నిజమైంది.
ఇప్పటి వరకు ఇంటి నుండి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి ఎలిమినేట్ అవగా తాజాగా అలీ 6వ కంటెస్టెంట్ గా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.
ఈ వారం నామినేషన్స్ లో భాగంగా శ్రీముఖి, రవి, రాహుల్, మహేష్, మరియు అలీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయ్యారు.
అతి తక్కువ ఓట్లతో అలీ ఎలిమినేట్ అయ్యాడు అని నాగార్జున ప్రకటించారు. అలీ ఎలిమినేషన్ తో ఇంటి
సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. ముఖ్యంగా శివజ్యోతి వెక్కి వెక్కి ఏడుస్తూ అలీని వదలలేదు.
చివరగా బిగ్ బాస్ విన్నర్ కానప్పటికీ ఇంటి సభ్యుల మనసులు గెలుచుకున్నానని అలీ చెప్పుకొచ్చాడు.
మరుసటి రోజు ప్రోమో వేయకపోవడంతో అలీ రీఎంట్రీ అని, సీక్రెట్ రూములో ఉంచారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.