Amma Lalo Ram Bhajana Lyrics in Telugu – Aay Movie

Amma Lalo Ram Bhajana Lyrics

Amma Lalo Ram Bhajana Lyrics అంజి కే మణిపుత్ర అందించగా, సంగీతాన్ని అజయ్ అరసాడ సమకూర్చగా పెంచల్ దాస్ పాడిన ఈ పాట ‘ఆయ్’ సినిమాలోనిది.

Amma Lalo Ram Bhajana Lyrics

అలా శ్రీనివాసుడు పద్మావతి దేవిని వదిలి వెళుతుంటే. శ్రీనివాసుని గుండెల్లో గునపం గుచ్చుకున్నట్టుందమ్మో, ఓ ఓ ఓ… గుండెను మెలిపెడుతున్న బాధని పంటి కింద, ఆ ఆ, కంటి కింద నీరుని కానరాకుండా, ఆ ఆ… ఎక్కెక్కి వెళుతున్నడమ్మో, ఓ ఒగలమ్మ కొడకా ఓ శ్రీనివాసా…

పేరు లేదు… ఊరు లేదు
ప్రేమిచేసిందండోయ్
ఆహ, అమ్మలాలో రామ్ భజన
మాట లేదు… మనువు లేదు
మనసిచ్చేసిందండోయ్
ఆహ, అమ్మలాలో రామ్ భజన.

వజ్రము లాంటి మొఖము వాడి పోయినాది
ఆహ, అమ్మలాలో రామ్ భజన
సిలకాలాంటి మొఖము సిన్నబోయినాది
ఆహ, అమ్మలాలో రామ్ భజన…

నిన్ను ఎవరు తిట్టారో, ఉయ్యాలో
నిన్ను ఎవరు కొట్టారో, ఉయ్యాలో
నిన్ను ఇడిసిపోతాంది, ఉయ్యాలో
నీ గోడెవరు ఇనేది ఉయ్యాలో…

ఆ శ్రీనివాసుడికి ఆస్తి లేదు అంతస్థు లేదని, ఆ..ఆ పద్మావతి దేవికి మేడలు మిద్దెలు ఉన్న పెద్దెంటి సంబంధము చేస్తానని, ఆ..ఆకాశ మహారాజు అంటున్నాడమ్మో, ఓ ఓ ఓ..

ఎక్కడ శ్రీనివాసుడు? చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతున్నాడు.. చిం చిమ్మరంకారు చిమ్మాడుతుంటే, కాకులు గద్దలు కారాడుతుంటే… అన్నవస్త్రాలు గట్టు పెట్టాడు, నిద్రాహారాలు విడిచిపెట్టాడమ్మో ఒగలమ్మ కొడకా శ్రీనివాసుడా…

నోయని నోములు నోసుకున్నాదమ్మ
ఆహ, అమ్మలాలో రామ్ భజన
సేయని పూజలు సేసుకున్నాదమ్మ
ఆహ, అమ్మలాలో రామ్ భజన…

శివుడి మాసపు రాత్రి శివుని జాగారాలు
ఆహ, అమ్మలాలో రామ్ భజన
మాఘ పున్నమున
మా పుణ్య నదుల తానాలు
ఆహ, అమ్మలాలో రామ్ భజన…

Watch అమ్మలాలో రామ్ భజన Lyrical Video

Amma Lalo Ram Bhajana Lyrics Credits

ఆయ్ Telugu Film – 
DirectorAnji K Maniputhra
ProducersBunny Vas and Vidya Koppineedi
SingerPenchal Das
MusicRam Miriyala, Ajay Arasada
LyricsAnji K Maniputhra
Star CastNarne Nithiin, Nayan Sarika
Song Label & Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *