AP Corona Virus News on 2nd April 2020 Live Updates
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 2, 2020 సాయంత్రం నాటికి 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, సాయంత్రం మరో 3 కేసులు పాజిటివ్ గా తేలాయి.
రాత్రి 10 గంటలకు విడుదల చేసిన బులెటిన్ ద్వారా ఇంకో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో 149కి పాజిటివ్ కేసులు చేరాయి.
రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ప్రధాన మంత్రి మోడీ గారిని కోరారు.
ఈరోజు (02.04.2020)నాడు రాష్ట్రంలో కరోనా వైరస్ సంబంధిత వార్తలు చూద్దాం.