ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఫలితాలు విడుదల – 8,351 మంది 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఫలితాలు (ప్రిలిమ్స్‌) శుక్రవారం విడుదల అయ్యాయి. 8,351 అభ్యర్థులు 1:50 చొప్పున మెయిన్స్‌కు
ఎంపిక అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ ఏడాది మే 26న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పేపర్‌–1, పేపర్‌–2 (స్క్రీనింగ్‌
టెస్టు) తుది ఫలితాలను ఎట్టకేలకు విడుదల చేసింది.

మొత్తం 167 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవగా ఒక్కో పోస్టుకు 50 మంది (1:50) చొప్పున 8,351 మంది మెయిన్స్‌కు ఎంపిక చేసింది. మెయిన్స్‌కు 90.42 మార్కులను కటాఫ్‌గా నిర్దేశించింది ఏపీపీఎస్సీ.

ఫలితాలు నిలుపుదల చేయాలని హైకోర్ట్ ఇచ్చిన స్టేను ఎత్తివేయడంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమం అయింది.

డిసెంబరు 12 నుంచి 23 వరకూ మెయిన్స్‌ పరీక్షలు ఏడు సెషన్లలో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *