Home » ఆధ్యాత్మికం » Atla Atla Poyeti Song Lyrics – అట్లట్ల పోయేటి ఓ రామచిలకా

Atla Atla Poyeti Song Lyrics – అట్లట్ల పోయేటి ఓ రామచిలకా

by Devender

Atla Atla Poyeti Song Lyrics penned & sung by Jadala Ramesh. అట్లట్ల పోయేటి ఓ రామచిలకా, మా బాల మణికంఠుని జాడ తెలిసిందా. కొమ్మల్ల కూసేటి ఓ కోయిలమ్మా….

Atla Atla Poyeti Song Credits

Song Category Telugu Devotional Song
Singer & Lyricist Jadala Ramesh
Music Jadala Ramesh
Song Source

Atla Atla Poyeti Song Lyrics in Telugu

అట్లట్ల పోయేటి ఓ రామచిలకా
మా బాల మణికంఠుని జాడ తెలిసిందా
(అట్లట్ల పోయేటి ఓ రామసిలకా
మా బాల మణికంఠుని జాడ తెలిసిందా)

కొమ్మల్ల కూసేటి ఓ కోయిలమ్మా
మా సిన్నీ అయ్యప్ప కనపడితే రమ్మని జెప్పో

పులిపాలకని ఎళ్ళినవాడు
ఇంతవరకు ఇల్లు జేరలే
పొద్దుననగా బయలుదేరినోడు
పొద్దుగూకినాది ఇంకా రాలే

ఏడ ఉన్నడో, ఏమి తిన్నడో
అడవిలో ఆకలితోని అల్లాడుతుండో
(పండ్లు ఫలములు ఉన్న వృక్షాల్లారా
మా బాలున్ని ఆకలి తీర్చరోయమ్మా)

అట్లట్ల పోయేటి ఓ రామచిలకా
మా బాల మణికంఠుని జాడ తెలిసిందా
(కొమ్మల్ల కూసేటి ఓ కోయిలమ్మా
మా సిన్నీ అయ్యప్ప కనపడితే రమ్మని జెప్పో)

ఇంటిముందట రోజు ఆడుకునేటోడు
అందరిని ఆట వట్టించెటోడు
కిలకిల నవ్వుతు అందర్ని నవ్విస్తూ
లేడీపిల్లోలే గంతులేసేటోడు

ముక్కుపచ్చలారని ఈ పసివాన్ని
అడవికి వంపా తల్లికి మనసెట్లా వచ్చే
(సెలయేటి గలగలల పరుగుల్లారా
మా అయ్యప్ప కనబడితే దూప దీర్చుండ్రే)

అట్లట్ల పోయేటి ఓ రామచిలకా
మా బాల మణికంఠుని జాడ తెలిసిందా
(కొమ్మల్ల కూసేటి ఓ కోయిలమ్మా
మా సిన్నీ అయ్యప్ప కనపడితే రమ్మని జెప్పో)

సందమామకన్న అందంగా మెలిగే
మా సిన్ని మణికంఠుణ్ణి జూసీ
ఏ పాపిష్టి కళ్ళు మండినాయో గానీ
బాలున్ని కడదేర్చ పంపినరమ్మా

లోకాలనేలే ఓ శంకరుడా
పసివాన్ని కరుణించి కాపాడి తోలియ్యవయ్యా
నలుదిక్కులేలేటి నారాయణుడా
బాలునికి ఎటువంటి అపాయం రానీయకయ్యా

అట్లట్ల పోయేటి ఓ రామచిలకా
మా బాల మణికంఠుని జాడ తెలిసిందా
(కొమ్మల్ల కూసేటి ఓ కోయిలమ్మా
మా సిన్నీ అయ్యప్ప కనపడితే రమ్మని జెప్పో)

అయ్యప్పా అయ్యప్పా, ఏడున్నవయ్యా
ఏమి తిన్నావయ్యా, ఎప్పుడొస్తావయ్యా
ఎదురుచూస్తున్నామయ్యా

అట్లట్ల పోయేటి ఓ రామచిలకా Video Song

Atla Atla Poyeti Song Lyrics in English

You may also like