Bagundalamma Part 2 Song Lyrics penned by Bullet Bandi Laxman, music composed by Kalyan Keys, and sung by Ramu Adnan, from the Love Failure Song category.
Bagundalamma Part 2 Song Credits
Director | Bullet Bandi Laxman |
Producer | Sravan Sandy |
Lyrics | Bullet Bandi Laxman |
Singer | Ramu Adnan |
Music | Kalyan Keys |
Artists | Akshith Marvel & Vaishnavi Sony |
Song Lable |
Bagundalamma Part 2 Song Lyrics
Baagundaalani Korukune Vaadini
Kolpothunnaanani Kaalipothundhe Madhi
Baagundaalani Korukune Vaadini
Kolpothunnaanani Kaalipothundhe Madhi
మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే
మంట ఓర్చుకోనిదే కంట నీరైనా జారనీవే
మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే
మంట ఓర్చుకోనిదే కంట నీరైనా జారనీవే
తప్పేలే తప్పేలే
గుండెలోతుల్లో ప్రేమున్న
కళ్ళల్లో దాచాను తప్పేలే
తప్పేలే తప్పేలే
కన్నవారికి మాటిచ్చి
కన్నీళ్ళు తీస్తున్న తప్పేలే
అందరిలాగే నువ్వు నన్ను ప్రేమించావే
అందరిలాగే నేను నిన్ను ఓడించానే
అందరిలాగే నువ్వు నన్ను కోరుకోలేదే
బాగుండాలని కోరుకునే వాడిని
కోల్పోతున్నానని కాలిపోతుందే మది
బాగుండాలని కోరుకునే వాడిని
కోల్పోతున్నానని కాలిపోతుందే మది
అనుకున్నానా మెడల మూడు ముళ్ళు నీవని
అనుకోలేదే ఇంకొకరితో ఏడడుగులేస్తనీ
రాసుకున్నామే నెత్తుటితో ప్రేమలేఖనీ
రాయనే లేదే ఆ దేవుడు మన నుదుటి రాతని
మిలమిల మెరిసేటి మేడలలో
చూస్తారే కాగిత కట్టలను
అడగరు ఆడోళ్ళ ఇష్టాలను
చేసి పంపిస్తారే బొమ్మలను
సచ్చిపోయేంత ప్రేమే నాకున్నా
మనసు సంపుకొని నీకు దూరమౌతున్నా
బాగుండాలని కోరుకునే వాడిని
కోల్పోతున్నానని కాలిపోతుందే మది
బాగుండాలని కోరుకునే వాడిని
కోల్పోతున్నానని కాలిపోతుందే మది
కన్నీళ్ళే నా బతుకు నోసుకున్నది
అందుకనే పసుపు పారాణి పూసుకున్నది
వెళుతున్నా చివరిసారి కళ్ళారా చూసుకో
బతికున్నా ఇక ఏ బంధం కాదని అనుకో
పువ్వులు అల్లిన కారులోనా
నవ్వులు తీస్తున్న ఊరికేనా
గుండెంతో నొప్పితో నిండుకున్నా
కన్నోళ్ళ పరువు కాపాడుతున్నా
నిన్ను పొందే అదృష్టం లేదురా
వచ్చే జన్మకైనా నీదాన్నైపోతరా
బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా
బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా