Deshamante Matham Kaadoi Gatham Kadoi Lyrics from the movie Jhummandi Naadam.
Deshamante Matham Kaadoi Gatham Kadoi Lyrics In Telugu
Movie: Jhummandi Naadam (01 July 2010)
Director: K.Raghavendra Rao
Singers: S.P.Balasubramanyam, Chaitra, Mounika
Music: M.M.Keeravani
Lyrics: Chandra Bose
Cast: Manchu Manoj, Tapasee
Producer: Manchu Lakshmi Prasanna
Music Lable: Aditya Music
దేశమంటే… ఏ ఏ… దేశమంటే మతం కాదోయ్… గతం కాదోయ్…
అడవి కాదోయ్… గొడవ కాదోయ్…
అన్న చేతి గన్ను కాదోయ్…
క్షుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్…
తీవ్ర వ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్…
దేశమంటే… ఏ ఏ…
గడ్డి నుండీ గగనమంటిన… కుంభకోణం కాదు కాదోయ్…
చట్ట సభలో పట్టుకున్న… జుట్టు జుట్టు కాదు కాదోయ్…
రాజధానుల రాచ భవనపు… రాసలీలలు కాదు కాదోయ్…
అబలపై ఆమ్లాన్ని చల్లే… అరాచకమే కాదు కాదోయ్…
పరిధి దాటిన గాలి వార్తల… ప్రసారాలు కాదు కాదోయ్…
సందు దొరికితే మంది చేసే… సమ్మె కాదోయ్ బందు కాదోయ్…
ప్రాణ ధన మానాలు తీసే… పగల సెగల పొగలు కాదోయ్…
దేశమంటే…ఏ ఏ…
దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్…
దేశమంటే మనుషులోయ్… దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్…
ప్రేమించు ప్రేమ పంచు.. ప్రేమగా జీవించు…
ప్రేమించు ప్రేమ పంచు… ప్రేమగా జీవించు…
ద్వేషమెందుకు సాటి మనిషిని… సోదరుడిగా ఆదరించు…
ప్రేమించు ప్రేమ పంచు… ప్రేమగా జీవించు…
హిసలెందుకు సమస్యలను… నవ్వుతూ పరిష్కరించు…
ప్రేమించు ప్రేమ పంచు… ప్రేమగా జీవించు…
క్రోధమెందుకు కరుణపంచు… స్వార్థమెందుకు సహకరించు…
పంతమెందుకు పలకరించు… కక్షలెందుకు కౌగిలించు…
ప్రేమించు ప్రేమ పంచు… ప్రేమగా జీవించు…
మల్లెపువ్వుల లాంటి… బాలల తెల్లకాగితమంటి…
బ్రతుకులు రక్త చరితగ… మారకుండా రక్ష కలిగించు…
కొత్త బంగరు భవిత… నేడే కానుకందించు…
ప్రేమించు ప్రేమ పంచు… ప్రేమగా జీవించు…
దేశమంటే… ఏ ఏ
దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్…
దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్…
దేశమంటే మనుషులోయ్… దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్..
దేశమంటే…ఏ ఏ
దేశమంటే మనుషులోయ్…
Watch Lyrical Video Of Deshamante – Jhummandi Naadam
Also Read: Punyabhoomi Naa Desham Song Lyrics