Kalaa Nijam Song Lyrics in Telugu – Bahishkarana, ZEE5 Original

Kalaa Nijam Song Lyrics Bahishkarana

Kalaa Nijam Song Lyrics పూర్ణాచారి అందించగా, సిద్ధార్థ్ సదాశివ్ని సంగీతానికి రోహిత్ పాడిన పాట బహిష్కరణ జీ 5 ఒరిజినల్ లోనిది. జీ 5 లో జులై 19, 2024న విడుదల అయినది.

Kalaa Nijam Song Lyrics in Telugu

ఆకాశం దాటింది మరి ఓ చిన్న చినుకు
ఈ నేలే చూడాలని వేసే అడుగు

ఎందాకో తెలియందే నీతో పరుగు
నీ చేయి తాకాకే ఏదో వెలుగు

దోబూచులాటేమిటో
ఇపుడు నాలాగ లేనేమిటో

కలా నిజం… ఇలా కలిసి నడవగ
కధే ఇలా మరో మలుపు తిరిగెను
ఇదే కదా ఎదే ఎపుడు తలచెను
ఈనాటి వరకూ…

అదేమిటో నువ్వే ఎదురు నిలవగ
హఠాత్తుగా ఏదో బదులు తెలిసెను
చెరో సగం జతై పడే అడుగులు
నీతోనే మొదలూ…

కోనేటి కలువకు నీతోనే పోలికే ఉంది కదా
నీ చుట్టు చేరిన పంకిలమే మరక పడనీకా

సరదాగా సాగే నీతో ఈ పయనం
గురుతు రాదు నాకు నీ చెంతనుంటే
ఈ సమయం…

రాసున్నదే ఏమిటో…
ఎదురు కానున్నదే ఏమిటో

కలా నిజం… ఇలా కలిసి నడవగ
కధే ఇలా మరో మలుపు తిరిగెను
ఇదే కదా ఎదే ఎపుడు తలచెను
ఈనాటి వరకూ…

అదేమిటో నువ్వే ఎదురు నిలవగ
హఠాత్తుగా ఏదో బదులు తెలిసెను
చెరో సగం జతై పడే అడుగులు
నీతోనే మొదలూ…

Watch కలా నిజం Lyrical Video Song

Kalaa Nijam Song Lyrics Credits

SingerPVNS Rohit
LyricsPurnachary
MusicSidharth Sadasivni
DirectorMukesh Prajapathi
ProducerPrashanti Malisetti
FeaturingAnjali, Ravindra Vijay, Ananya Nagalla
Song LabelZEE5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *