Koncham Karanga Song Lyrics in Telugu & English – Chakram

Koncham Karanga Song Lyrics

Koncham Karanga Song Lyrics సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, చక్రీ సంగీత దర్శకత్వంలో కౌసల్య ఆలపించిన ఈ పాట ప్రభాస్ నటించిన ‘చక్రం’ సినిమాలోనిది.

Koncham Karanga Song Lyrics in English

Koncham Karanga
Koncham Gaaranga
Koncham Kashtamga
Koncham Ishtamgaa

Koncham Karanga Song Lyrics in Telugu

కొంచెం కారంగా… కొంచెం గారంగా
కొంచెం కష్టంగా… కొంచెం ఇష్టంగా

అందించనీ అధిరే అదరాంజలి
బంధించనీ కాలాన్నీ కౌగిలీ
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలి
మంటల్లే నను మరిగించాలి

కొంచెం కారంగా… కొంచెం గారంగా
కొంచెం కష్టంగా… కొంచెం ఇష్టంగా

తలుపేసుకుంటే… నీ తలపాగుతుందా
మదిలో నువ్వుంటే… స్నానం సాగుతుందా
నీ విషమే పాకింది నర నరమునా
ఇక నా వశము కాకుంది యమ యాతనా

లేని పోని నిందలు గాని
హాయిగానే ఉందని గాని
ఉన్నమాట నీతో చెప్పనీ

కొంచెం కారంగా… కొంచెం గారంగా
కొంచెం కష్టంగా… కొంచెం ఇష్టంగా

అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ
లాగావు గుట్టు… గుండెల్లోకే చూస్తూ
నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా
నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా

మనసు కంది మన్మధలేఖ
కెవ్వుమంది కమ్మని కేక
వయసు కందిపోయే వేడిగా..

కొంచెం కారంగా… కొంచెం గారంగా
కొంచెం కష్టంగా… కొంచెం ఇష్టంగా

అందించనీ అధిరే అదరాంజలి
బంధించనీ కాలాన్నీ కౌగిలీ
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలి
మంటల్లే నను మరిగించాలి

కొంచెం కారంగా… కొంచెం గారంగా
కొంచెం కష్టంగా… కొంచెం ఇష్టంగా

Watch కొంచెం కారంగా Song

Koncham Karanga Song Lyrics Credits

MovieChakram (25 March 2005)
DirectorKrishna Vamsi
ProducersC Venkat Raju, Sivaraju
SingerKousalya
MusicChakri
LyricsSirivennela Seetharama Sastry
Star CastPrabhas, Charmy, Asin
Music Label

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *