Lacchi Gaani Pelli Song Lyrics penned by Kasarla Shyam, music composed & sung by Bheems Ceciroleo from Telugu cinema ‘Slum Dog Husband‘.
Lacchi Gaani Pelli Song Credits
Movie | Slum Dog Husband |
Director | A R Sreedhar |
Producers | Appi Reddy, Venkat Annapareddy |
Singer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Lyrics | Kasarla Shyam |
Star Cast | Sanjay Rrao, Pranavi Manukonda |
Music Label & Source |
Lacchi Gaani Pelli Song Lyrics
మా లచ్చిగాని పెళ్లి
ఇగ పార్సిగుట్టల లొల్లి
మా లచ్చిగాని పెళ్లి
నువ్వు మర్ఫా గొట్టరా మళ్ళీ
మా లచ్చిగాని పెళ్లి
ఇగ పార్సిగుట్టల లొల్లి
మా లచ్చిగాని పెళ్లి
నువ్వు మర్ఫా గొట్టరా మళ్ళీ
మా లచ్చిగాని పెళ్లి
నువ్వు కచ్ఛా కొట్టరా డిల్లీ
ఆడి నుంచి ఈడికెళ్లి
ధూంధాం గల్లీ గల్లీ
మా లచ్చిగాని పెళ్లి
నువ్వు హారతి పట్టు
వీనికి పెట్టరా బొట్టు
నువ్వు సెల్‌ఫోన్ పట్టు
ఒక సెల్ఫీ గొట్టు
అరె రారా నట్టు
జర తేరా లడ్డు
నెత్తికి రిబ్బన్ చుట్టు
ఎగిరి ఫల్టీ గొట్టు
అరె చిలకలగూడ టిప్పు
నీ తల్వార్ జోరుగా తిప్పు
ఒరేయ్ వారసిగూడా వాసు
నువు మాయదారి మైసు
చల్ నర్సింగన్న నాగిని డ్యాన్సుకు
దస్తీ పుంగి ఊపు ఊపు
లచ్చిగాని పెళ్లి
మా లచ్చిగాని పెళ్లి
ఇగ పార్సిగుట్ట లొల్లి
చల్ మా లచ్చిగాని పెళ్లి
నువ్వు మర్ఫా గొట్టరా మళ్ళీ, మళ్ళీ
జంబో గిలాస్ నెత్తిల బెట్టి
డిస్కో డ్యాన్స్ చెయ్యాలే
బాటిల్ మీదా బాటిల్ గుద్ధి
బండికడ్డం పండాలే
బగరా బువ్వ పెడితే
బగోనలే లేవలే
తలకాయ కూర కాల్ల షోర్వ
గిన్నెలు ఖాళీ జెయ్యాలే
అడ్డగుట్ట అదిరిపోయే
మెట్టుగూడ మెరిసిపోయే
పార్శిగుట్ట పార్శిగుట్ట
పార్శిగుట్ట, చల్
ఏయ్ పార్శిగుట్ట పార్శిగుట్ట
పార్శిగుట్ట ఎన్నిసార్లంటవ్రా బయ్
చల్ గుడ్డముయ్
మన లచ్చిగాని పెళ్లి ఎట్లుండాలే
బట్టలు చినిగిపోవాలే
ఏయ్, నువ్వు కొట్టురా బై
మా చిచ్చగాని పెళ్లి
ఇగ పార్సిగుట్టల లొల్లి
మా సాలేగాని పెళ్లి
నువ్వు మర్ఫా గొట్టరా మళ్ళీ
తమ్మీ మొండా మార్కెట్ కెల్లి
పూల దండలు తెచ్చి ఎయ్యరా బయ్
బోయిగూడ కాంపౌండ్ నించి
కల్లు గుడాలు ఉంటే జై
సినిమా హీరో లెక్క వీన్ని
అందరు చూసి మెచ్చాలే
లచ్చిగాని భరాత్ అంటే
లచ్చరూపాయిల్ ఒడవాలే
తెలంగాణ ఆంధ్ర కాదు
ఇండియా మొత్తం తెల్వాలే
అందరు మన లచ్చిగాని పెళ్లి
గురించే మాట్లాడలేహే
నువ్వు కొట్టురా బై
మ లచ్చిగాని పెళ్లి
ఇక పార్సిగుట్టల లొల్లి
మా మచ్చగాని పెళ్లి
నువ్వు మార్ఫా కొట్టరా మళ్ళీ
చల్ లచ్చిగాని పెళ్లి
నువ్వు మర్ఫా గొట్టరా మళ్ళీ, మళ్ళీ
ఏయ్, పాట ఏందిరా
గంత జల్దీ అయిపోయింది
మళ్ళీ కొట్టుర్రి బే