Laga Laaga Laggam Song Lyrics in Telugu & English – Laggam

Laga Laaga Laggam Song Lyrics

Laga Laaga Laggam Song Lyrics మరియు సంగీతం చరణ్ అర్జున్ అందించగా, శ్రీ కృష్ణ, చిన్మయి శ్రీపాద మరియు శ్రీనిక మహతి పాడిన ఈ పాట ‘లగ్గం’ సినిమాలోనిది.

Laga Laaga Laggam Song Lyrics in Telugu

రారమ్మ జనులార రతనాలు దంచా
(రతనాలు దంచా)
పచ్చాని పందిట్లో తలువాలు దంచా
(తలువాలు దంచా)

కుసుమాంబ కుందెండ్లు చెరుకు రోకండ్లు
(చెరుకు రోకండ్లు)
జాజిపూల జల్లెడ మలెపూల చాట
(మలెపూల చాట)
పాడుతు పడతులు పసుపు దంచంగా
(పసుపు దంచంగా)

నలుగుక్కు నలుగుక్కు నలుగుక్కు
నలుగుక్కు రావయ్య
నలుగుక్కు నలుగుక్కు నలుగుక్కు ||2||

నలుగుకు రావయ్య నాధ శ్రీనాధ
నలుగుకు రావయ్య నాధ శ్రీనాధ
వేగంగా రావయ్య వేణుగోపాలా
వేగంగా రావయ్య వేణుగోపాలా

మంగళ స్నానాల రంగుల రాధా
కంగారు పడుతుంది అలిగి నీ మీదా
మొదలయ్యినాదంట నీ మధుర గాధా
మొదలయ్యినాదంట నీ మధుర గాధా

నీకు నాకు కుదిరింది సంబంధం
ఇంతకన్న ఏముంది ఆనందం
పత్రికలు పంచి అందరినింటికి రమ్మందాం

ఇంక మనకు నాలుగు కళ్ళంటా
ఇద్దరిది ఒకటే ఇల్లంటా
పూలుపండ్ల నుండి మొదలు
మూడు ముళ్ళదాకా…

జరిగేది అరదినమే
జన్మంతా జ్ఞాపకమే
మనకు మనమే ఎంచుకున్న
మధుర బంధమే

లగ్గం, మనకు లగ్గం
ఓ లగ లాగ, లగ లాగ లగ్గం
లగ్గం, మనకు లగ్గం
ఓ లగ లాగ, లగ లాగ లగ్గం…

భద్రగిరిలో రామచంద్రయ్య నువ్వు
భద్రంగా కాయరా సీతమ్మ నవ్వు
జాగు సెయ్యక నువ్వు జానకి తల్లి
జావళీలు పాడు జల్దీగ వెళ్ళి…

రత్నాలు కానుకలు అడగొద్దు రామా
కనక రాసుల మించి, కళ ఉన్న భామా
నీ ఇంట అడుగేసే నీలాల రామా
సీతననే మించిన సిరి చూడతరమా.

దరువాజ మెరిసింది ధగ ధగ
మామిడి తోరణాలతో
ఆడబిడ్డలంతా వేడుకై తరలేను
ఐరేని కుండలతో…

ఎదురుకోల్లు, ఆ మైలపోల్లు
గట్టి మేళాల సవ్వడితో
బంధుమిత్రులంత సందడై చేరారు
సంద్రమంత ప్రేమతో…

ఈ క్షణమున మనము
ఇలల శివుడు పార్వతీ
జీవిత బడిలోన
ఇదే మొదటి తరగతి…

జీలకర్రా బెల్లం
కలుపుతుంది సోపతి
కులుకుల ఈ కుమారి
అయిపోతుంది శ్రీమతి.

తాటాకు పందిళ్ళు
వాడ కట్టున సందళ్లు..

విడి విడి ఆ చుక్కలనే
కలుపు ముగ్గటా…

లగ్గం, మనకు లగ్గం
ఓ లగ లాగ, లగ లాగ లగ్గం
లగ్గం, మనకు లగ్గం
ఓ లగ లాగ, లగ లాగ లగ్గం…

ఈ జన మోతల్ల డిగిచిక్క చిక్క
మెల్లకు లాగాలి అంటోంది అక్క
ఆ మాత్రముండాలి మన ఇంటి లెక్క
రెక్కలిప్పి ఆడుదాము ఏంచక్కా

ధావతు జెయ్యాలి శాంతి నేలంతా
బారతు తియ్యాలి పూరా ఇలాకా
తోడు జేసిండ్రంట మీరెంచు పెండ్లి
ఏండ్ల కొద్ది చెప్పుకుంటారు రండి

Watch లగ లాగ లగ్గం Lyrical Video Song

Laga Laaga Laggam Song Lyrics in English

Laga Laaga Laggam Song Lyrics Credits

Laggam Telugu Film
DirectorRamesh Cheppala
ProducerVenu Gopal Reddy
SingersSri Krishna, Chinmayi Sripada & Shreenika Mahathi
MusicCharan Arjun
LyricsCharan Arjun
Star CastSai Ronak, Pragya Nagra
Music Label & Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *