Home » Telugu Lyrics » Maa Ooru Srikakulam Song Lyrics – శ్రీకాకుళం Sherlockholmes

Maa Ooru Srikakulam Song Lyrics – శ్రీకాకుళం Sherlockholmes

by Devender

Maa Ooru Srikakulam Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Sunil Kashyap and sung by Mangli.

Maa Ooru Srikakulam Song Lyrics in English

Maa Ooru Srikakulam Song Lyrics in Telugu

సిక్కోల్లం మేము
వలసెల్లి పోతాము
కడుపు నింపుకోటాకీ
వలసెల్లి పోతాము

మా ఊరు శ్రీకాకుళం
మేమంత శ్రామికులం
స్వేధమే మూలధనం
ఊరికి మాకు దూరం…

పొట్ట చేతపట్టి పొలిమెర దాటి
మూట ముల్లె పిల్ల జెల్లాలతోటి
రివ్వు రివ్వుమని వలస గువ్వలం
ఏడాదికోసారి మా గూటికొస్తాం.

మా ఊరు శ్రీకాకుళం
మేమంత శ్రామికులం
స్వేధమే మూలధనం
ఊరికి మాకు దూరం…

కూసింత ఇంటిమీద ధ్యాస మళ్ళిన గాని
మాకు మేమే కాళ్ళు కట్టేసుకుంటం
కూలి నాలి బతుకు మల్లా గుర్తుకొచ్చి
ఎల్లగూడేదంటు ఒట్టేసుకుంటం…

రెక్కలాడకుంటే డొక్కాడదే
గుండే గుక్క పెట్టకుండ తెల్లారదే

ఈ చోట కొన్నాళ్ళు
ఆ చోట కొన్నాళ్ళు
మారిపోతాయంట ఇల్లు ఊళ్లు
తీరిపోనివంట మా కన్నీళ్ళు.

మా ఊరు శ్రీకాకుళం
మేమంత శ్రామికులం
స్వేధమే మూలధనం
ఊరికి మాకు దూరం…

Watch మా ఊరు శ్రీకాకుళం Lyrical Video

Maa Ooru Srikakulam Song Credits

Srikakulam Sherlockholmes
Director Writer Mohan
Producer Vennapusa Ramana Reddy
Singer Mangli
Music Sunil Kashyap
Lyrics Ramajogayya Sastry
Star Cast Vennela Kishore, Ananya Nagalla
Music Label © & Source

You may also like

Leave a Comment