Maaya Kaadammo O Kundana Bomma Lyrics – Love Failure Song

Maaya Kaadammo O Kundana Bomma Lyrics

Maaya Kaadammo O Kundana Bomma Lyrics బుల్లెట్టు బండి లక్ష్మణ్ అందించగా, మదీన్ ఎస్కే సంగీతాన్ని సమకూర్చగా హనుమంత్ యాదవ్ పాడగా, అక్షిత్ మార్వెల్ మరియు వైష్ణవి సోనీ ల మీద ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించారు మేకర్స్.

Maaya Kaadammo O Kundana Bomma Lyrics in Telugu

ఎవ్వరున్న గానీ లేకపోని గానీ
నువ్వు ఉంటె చాలే నా ఈ జన్మకీ
చేతిలోన చేయి వేసి కొంగుముడి
ఋణపడిపోతానే ఆ బ్రహ్మకీ…

కన్నుల్లో కన్నులే చూడలేనులే
పెదవుల్లో చిరునవ్వై తోడుగుంటనే
ఏ జన్మల పుణ్యమో, పొంగే ఆనందమే
నువ్వయ్యాక నాకు సొంతమే.

మాయ కాదమ్మో ఓ కుందన బొమ్మా
నే మోయలేనమ్మో నువు లేని ఈ జన్మా
మాయ కాదమ్మో ఓ కుందన బొమ్మా
నే మోయలేనమ్మో నువు లేని ఈ జన్మా.

కాళ్ళు పట్టుకుంటా, కంటనీళ్ళు తీస్తా
నా కన్నీళ్ళలతో నీ పాదాలనే కడుగుతా
చెయ్యి వట్టుకుంటా, చెయ్య తప్పునంటా
నీ చేతి గోరింటాకై నే ఎర్రగ పండుతా.

యాపచెట్టు కింద నేనున్నా
పిల్ల నీకు నిజము చెబుతున్నా
తప్పు చేసుంటే తెల్లారే కన్నుమూయనే!
నన్ను నెత్తినెట్టుకోవమ్మా
నన్ను విడిచి ఉండలేవమ్మా
కోపమెందుకే నీ ప్రేమను చూపే.

మాయ కాదమ్మో ఓ కుందన బొమ్మా
నే మోయలేనమ్మో నువు లేని ఈ జన్మా
మాయ కాదమ్మో ఓ కుందన బొమ్మా
నే మోయలేనమ్మో నువు లేని ఈ జన్మా.

సాలి సాలలేని బతుకే నాదమ్మా
నీ రాకతోనే సాలనిపించే నా ఈ జన్మా

జాలి దయ లేని మనసు నాదమ్మా
నా అవతారం జూస్తె జాలేస్తలేదానే
పట్ట పట్ట కన్నీళ్ళు జారే
బట్ట పొట్ట సోయిడ లేదే
తోడు లేక గూడు ఇడిసి
తిరుగుతున్న పక్షినైనా.

చుట్టు ముట్టు సుట్టాలున్నారే
చెంపలేసుకుంటున్న సూడే
తోడుగొచ్చి చెయ్యి వట్టి
నడిపించగ రావే.

మాయ కాదమ్మో ఓ కుందన బొమ్మా
నే మోయలేనమ్మో నువు లేని ఈ జన్మా
మాయ కాదమ్మో ఓ కుందన బొమ్మా
నే మోయలేనమ్మో నువు లేని ఈ జన్మా

Maaya Kaadammo O Kundana Bomma Lyrics Video.

Maaya Kaadammo O Kundana Bomma Lyrics Credits

SongLove Failure Songs
DirectorRaj Narendra
LyricsBulletu Bandi Laxman
SingerHanumanth Yadav
MusicMadeen SK
ArtistsAkshith Marvel & Vaishnavi Sony
Song Lable

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *