Mallosthava Nanna Song Lyrics దిలీప్ దేవగన్ అందించడంతో పాటు పాడిన ఈ పాటకు ఇంద్రజిత్ సంగీతం అందించగా, దర్శకుడు గుండెలకు హత్తుకునేలా పాటను చిత్రీకరించారు.
Mallosthava Nanna Song Credits
Lyrics | Dilip Devgan |
Singer | Dilip Devgan |
Music | Indrajitt |
Producer | Marripelli Shivakumar |
Cast | Kancharapalem Raju,Mohan Marripelli,Dilip Devgan |
Music Lable | Mohan Marripelli Official |
Mallosthava Nanna Song Lyrics
చీకటి ముసిరిందే నాన్న నువు లేకా
అడుగే ఆగిందే తోడే నువు రాకా…
చీకటి ముసిరిందే నాన్న నువు లేకా
అడుగే ఆగిందే తోడే నువు రాకా
నను వీడి పోవంటూ నీలోకం నేనంటూ
వదిలేసి పోతే ఎలా నాన్న
అడుగుల్లో అడుగేస్తూ
నా నడకను నేర్పిస్తూ
పడిపోతున్నా రాలేవా?
మళ్ళొస్తావా నాన్న ఒకసారి
నిను చూసుకుంటానిలా
తిరిగొస్తావ నాన్న ఒకసారి
నిను పిలుసుకుంటానిలా…
మళ్ళొస్తావా నాన్న ఒకసారి
నిను చూసుకుంటానిలా
తిరిగొస్తావ నాన్న ఒకసారి
నిను పిలుసుకుంటానిలా..
తిడతావా తిట్టు, కొడతావా కొట్టు
ఉలుకే పలుకే లేదే ఎందుకు నాన్న
దూరం ఐనట్టు చేయకు నా సుట్టు
ఎదనిండా నిన్నే హత్తుకోనా
నువ్ పాడిన జోలాలి
నే పాడనా ఈ లాలి
నిదరోవయ్యా నా ఒడిలో
నువ్ దువ్విన పాపిడి
తల దువ్వన తలవోసి
నా కొడుకువయ్యావెలా నాన్న
మళ్ళొస్తావా నాన్న ఒకసారి
నిను చూసుకుంటానిలా
తిరిగొస్తావ నాన్న ఒకసారి
నిను పిలుసుకుంటానిలా
మళ్ళొస్తావా నాన్న ఒకసారి
నిను చూసుకుంటానిలా
తిరిగొస్తావ నాన్న ఒకసారి
నిను పిలుసుకుంటానిలా
ఎవరేమంటున్నా ఎదగవు అంటున్నా
నేనున్నానంటూ తోడైనావా…
ఏరా అంటుంటే, నువ్వే వింటుంటే
ఏదైనా గెలిచే ధైర్యం నాన్న
తప్పే నిను తిట్టాను
కోపం చూపించాను
ఏమైపోతావని భయమే నాన్న
నాకేమి కాదంటూ
నువ్ చెప్పిన ఆ మాటలు
ఇంకా నా చెవి వింటుందా నాన్న…
కదిలొస్తావా నాన్న కడసారి
నీ ఒడిలోన ఒరగాలిలా
మళ్ళీ పుడతావ నాన్న నా కొడుకై
నిను పెంచుకుంటానిలా…
వెళ్ళొస్తారా నాన్న కడసారి
నింగిల సుక్కై సెరానిలా
మళ్ళొస్తారా నాన్న నీ కొడుకై
నిన్ను సేరుకుంటానురా…