Mangli 2025 Shivaratri Song Lyrics మరియు సంగీతం చరణ్ అర్జున్ అందించారు. మంగ్లీ ఆలపించగా, అద్భుతంగా చిత్రీకరించారు ఈ పాటను దాము రెడ్డి. మంగ్లీ శివరాత్రి 2025 పాట.
Mangli 2025 Shivaratri Song Credits
Music: Charan Arjun
Lyrics: Charan Arjun
Singer: Mangli
Director: Damu Reddy
Label: Mangli Official
Mangli 2025 Shivaratri Song Lyrics
ఒకటి రెండు కాదు మూడు కన్నులు ఉన్నా
ఎటు చూస్తడొ… ఏం చేస్తడొ అర్థం కాడు…
(భంభంభం భోళా… శంభో శివ లీల)
వంద దాకా దాదాపు వరసలు ఉన్నా
ఎవ్వరికేమైతాడో తెలపడు జూడు…
(ఢం ఢం ఢం డోలా… త్రిలోకాది త్రిశూల)
ఆ, సరసన గౌరమ్మను… శిరసున గంగమ్మను
నిలిపి ఎట్ట పంచినావో… అంత ప్రేమను.
ఎంత అనీ వెతకను… ఎన్ని కథలు చదవను
పూటకొకటి చూపుతుంటే కొత్త మాయను
అభయంకర కింకర ఘీంకర శంకరుడా
ఏ రంగుకు, హంగుకు లొంగని జంగముడా
(భంభంభం భోళా… శంభో శివ లీల)
(ఢం ఢం ఢం డోలా… త్రిలోకాది త్రిశూల)
ఈశా పరమేశా… కైలాస వాసా
జగములనేలే జగదీశా
ధరణికి నువ్వే దరహాసా
అఖిలా లోకేశ… అర్ధనారీశా
మాలో ఆశావిశ్వాస
నువ్వే సకల సంతోషా
జంగమ దేవా… శివలింగమ దేవా
జర చూపించయ్యా నిషి ఉండని తోవ
బంధము నువ్వే… నా బంధువు నువ్వే
నువ్వుంటే ఎదలో… బతుకింతా సజావా
అభయంకర కింకర ఘీంకర శంకరుడా
(భంభంభం భోళా… శంభో శివ లీల)
ఏ రంగుకు, హంగుకు లొంగని జంగముడా
(ఢం ఢం ఢం డోలా… త్రిలోకాది త్రిశూల)
రంకెలు వేసేటి… నందే నీ రకము
తనువును కప్పే… పులి చర్మమూ
మెడలో విషనాగ సర్పమూ
ఢమరుక దండోరా… గరళా గంభీర
అంతే తెలియని ఆంతర్యమూ
అయినా నువ్వే మా ధైర్యము
నీలకంఠాధార… నిఖిల జీవసుధార
నీ సృష్టే కాదా ప్రతి జీవుడు
దునియా మీద ఎన్ని ధైవాలున్నా
అందరికి నీవేలే ఆదిదేవుడు
అభయంకర కింకర ఘీంకర శంకరుడా
(భంభంభం భోళా… శంభో శివ లీల)
ఏ రంగుకు, హంగుకు లొంగని జంగముడా
(ఢంఢంఢం డోలా… త్రిలోకాది త్రిశూల)