Mangli Ugadi Song Lyrics penned by Dr. Kandikonda, music composed by Nandan Bobbili, and sung by Mangli. Ugadi Telugu Song.
Mangli Ugadi Song Credits
Lyrics | Dr. Kandikonda |
Singer | Mangli |
Chorus | Manju & Indira |
Music | Nandan Bobbili |
Music Lable |
Mangli Ugadi Song Lyrics In Telugu
అటు కోకిల కూత… కొమ్మల్లో పాడే తొలి ఉగాది పాట
ఇటు మామిడి కాత… వగరుతో మోసుకువచ్చే ఉగాది నింటా
చిరు వేప లేత పూత… తనవెంట తీసుకువచ్చే ఉగాదినంతా
వాసంత ఋతువుల వన్నే… దోసిట్లో నింపుకు వచ్చే ఉగాది ఘనతా
ఆరు రుచుల పచ్చడి అందించే… ఈ ఉగాది నేడే అమృతాన్ని ఇలకే దించేసే
చిరు వగరు చిరు కారం… తీపి లాగా
చిరు చేదు చిరు ఉప్పు… పులుపు కలెగలుపుగా
మన బ్రతుకున ఆనందం దుఃఖం ఉంటాయిగా
ఉగాది పచ్చడి తెలిపే నీతిదియేగా
అటు కోకిల కూత… కొమ్మల్లో పాడే తొలి ఉగాది పాట
ఇటు మామిడి కాత… వగరుతో మోసుకువచ్చే ఉగాది నింటా
పంచాంగ శ్రవణాలు పద్య కవిత రాగాలు
అష్టదిగ్గజాలకు ధీటుగా…
తెల్ల అంచు పంచెలు భుజం మీది కండువలు
తెలుగు తేజస్సే వేరుగా
తెలుగు జాతి సంవత్సరం… వందలేండ్ల మహోత్సవం
సాంప్రదాయ వరోత్సవం… సంస్కృతుల నవోత్సవం
ఆదర్శం మనకట్టు… అమ్మతనం మన బొట్టు
మట్టి గుణమే మన గుట్టు… ఊఉ ఊ ఊ
చిరు వగరు చిరు కారం… తీపి లాగా
చిరు చేదు చిరు ఉప్పు… పులుపు కలెగలుపుగా
మన బ్రతుకున ఆనందం దుఃఖం ఉంటాయిగా
ఉగాది పచ్చడి తెలిపే నీతిదియేగా
దుక్కి దున్నే నాగళ్ళు… నవ్వే నల్ల రేగళ్ళు
కొత్త సాలు నేడే మొదలుగా
పలుగుపార పరవళ్ళు… రైతు చెమట చిరుజల్లు
అన్నానికి ప్రతిరూపాలుగా
శ్రీవిళంబి నామ సంవత్సరం
సిరులకిది శ్రీకారం పలుకుతోంది ఆహ్వానం
పసిరికల మధుమాసం
మట్టి పగిలి మొలకవును… మొలక ఎదిగి మానవును
మనిషికదే బ్రతుకవును
చిరు వగరు చిరు కారం… తీపి లాగా
చిరు చేదు చిరు ఉప్పు… పులుపు కలెగలుపుగా
మన బ్రతుకున ఆనందం దుఃఖం ఉంటాయిగా
ఉగాది పచ్చడి తెలిపే నీతిదియేగా
అటు కోకిల కూత… కొమ్మల్లో పాడే తొలి ఉగాది పాట
ఇటు మామిడి కాత… వగరుతో మోసుకువచ్చే ఉగాది నింటా