Mangli Women’s Day Song Lyrics – మంగ్లీ ఉమెన్స్ డే ఈటీవీ ప్లస్ సాంగ్ లిరిక్స్
డైరెక్టర్: బి.ఎన్.అజిత్ నాగ్
లిరిక్స్: అనంత్ శ్రీరామ్
సింగర్: మంగ్లి
మ్యూజిక్: జీవన్
నటులు: మంగ్లి, అంకిత, అనూష, కరుణ, లహరి, ప్రియాంక, రసజ్ఞ, శాంభవి, శ్రీ ప్రియ, శ్వేత
ప్రొడ్యూసర్: ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్
అమ్మగా.. అమ్మాయిగా.. చెలియగా.. చెల్లాయిగా
ఇంటిని నడిపే ఇంతులందరికి.. ఇదే మా వందనం…
ఊరిలో అధికారిగా.. పోరులో అధినేత్రిగా..
జాతిని నడిపే జాణలందరికి… ఇదే నీరాజనం…
మహిళ లేనిదే మహిళా లేదే, వైభవం..
అది చాటేందుకే ఈనాడు వచ్చింది.. మరలా మహిళా దినోత్సవం…
మహిళా దినోత్సవం… మహిళా దినోత్సవం…
తోబుట్టువులెందరో తల్లులై తరలి..
చూపుతున్నారు కుటుంబాలకే కోరుకున్న మజిలీ…
అడుగుబయటికేస్తే చాలూ.. మిమ్మల్ని అడ్డుకుంటాయి ఎన్నో సవాళ్లు..
అయినా, నిబ్బరంగా నిలిచే ఆడవాళ్ళూ.. మీకు జోహార్లు…
అవి అర్పించేందుకు ఈనాడు వచ్చింది.. మరలా మహిళా దినోత్సవం…
మహిళా దినోత్సవం… మహిళా దినోత్సవం…
సంకల్పం(మే) శ్వాసగా సాగిపో సబలా..
నువ్వు నీలోకి ప్రయాణించవే నీకు నువ్వు జతగా..
ఆశయంతో కలిపే కాలు.. నిన్నింక ఆపలేవంట చుట్టూ కష్టాలు..
సంఘం మేలు కోసం మెరిసే.. నీ చూపే మాకు హరివిల్లు…
అది దర్శించేందుకు ఈనాడు వచ్చింది.. మరలా మహిళా దినోత్సవం…
మహిళా దినోత్సవం… మహిళా దినోత్సవం…
Watch Women’s Day ETV Plus Video Sung by Mangli
Mangli Women’s Day Song Lyrics in English
Director: B.N.Ajit Nag
Lyrics: Ananth Sriram
Singer: Mangli
Music: Jeevan
Cast: Mangli, Ankitha, Anusha, Karuna, Lahari, Priyanka, Rasagnya, Shambhavi, Sri Priya and Swetha
Producer: Eenadu Television Private Limited
Ammagaa.. Ammaayigaa.. Cheliyagaa.. Chellaayigaa
Intini Nadipe Inthulandariki.. Idhe Maa Vandhanam…
Oorilo Adhikaarigaa, Porulo Adhinethrigaa..
Jaathini Nadipe Jaanalandariki.. Idhe Neeraajanam…
Mahila Lenide Mahilaa Ledhe, Vaibhavam..
Adhi Chaatenduke Eenaadu Vachhindi.. Maralaa Mahilaa Dhinotsavam.
Mahilaa Dhinotsavam… Mahilaa Dhinotsavam….
Thobuttuvulendaro Thallulai Tharali..
Chooputhunnaaru Kutumbaalake Korukunna Majili…
Adugu Bayatikesthe Chaalu, Mimmalni Addukuntaayi Enno Savaallu..
Ayinaa Nibbaramgaa Niliche AADAVAALLUU.. MEEKU JOHAARLU…
Avi Arpinchenduku Eenaadu Vachhindi.. Maralaa Mahilaa Dhinotsavam.
Mahilaa Dhinotsavam… Mahilaa Dhinotsavam….
SankalpamE Shwasagaa Saagipo Sabalaa..
Nuvvu Neeloki Prayaaninchave Neeku Nuvvu Jathagaa…
Aashayamtho Kalipe Kaalu.. Ninninka Aapalevanta Chuttu Kashtaalu..
Sangham Melu Kosam Merise.. Nee Choope Maaku Harivillu..
Adhi Darshinchenduku Eenaadu Vachhindi.. Maralaa Mahilaa Dhinotsavam.
Mahilaa Dhinotsavam… Mahilaa Dhinotsavam….
Read Also Lyrics: Mangli Shivarathri Song
Super song. Malli malli vinalanipisthadhi..