Mattu Vadalara Song Lyrics penned by Kosaraju Garu, music composed by T V Raju Garu, and sung by Ghantasala Garu from Telugu movie ‘Sri Krishna Pandaveeyam‘.
Mattu Vadalara Song Credits
శ్రీకృష్ణ పాండవీయం Movie Released Date – 13 January 1966 | |
Director | N T Rama Rao |
Producer | N Trivikrama Rao |
Singer | Ghantasala |
Music | T V Raju |
Lyrics | Kosaraju |
Star Cast | N T Rama Rao, Varalakshmi |
Music Label & Source |
Mattu Vadalara Song Lyrics in English
Apaayammu Daatadaaniki Upaayammu Kaavaali
Andhakaaramalaminapudu Veluturukai Vedakaali
Mundhuchoopu Lenivaadu Endunaku Koragaadu
Somariyai Kunukuvaadu Sookshamammu Grahinchaledu
Mattu Vadalara Niddura Mattu Vadalaraa
Mattu Vadalara Niddura Mattu Vadalaraa
Aa MatthulonaBadithe Gammatthuga Chittavudura
Mattu Vadalara Niddura Mattu Vadalaraa
Jeevithamuna Sagabhaagam Niddurake Saripovu
Jeevithamuna Sagabhaagam Niddurake Saripovu
Migilina Aa Sagabhaagam Chitthashuddhilekapovu
Athinidraloludu Telivileni Moorkhudu
Athinidraloludu Telivileni Moorkhudu
Paramaardham Gaanaleka Vyardhanga Chedataadu
Mattu Vadalara Niddura Mattu Vadalara
Saaginantha Kaalammu Naa Antha Vaadu Ledanduru
Saagakapothe Ooraka Chathikilabadipodhuru
Kandabalamu Thote Ghanakaaryamu Saadhinchaleru
Buddibalamu Thodaithe Vijayammu Varimpagalaru
Mattu Vadalara Niddura Mattu Vadalara
ChuttuMuttu Aapadalanu MattubettaBoonumuraa
ChuttuMuttu Aapadalanu MattubettaBoonumuraa
Pirikithanamu Kattipetti Dhairyamu Chepattumura
Karthavyam Nee Vanthu Kaapaaduta Naavanthu
Karthavyam Nee Vanthu Kaapaaduta Naavanthu
Cheppadame Naa Dharmam… Vinakapothe Nee Karmam
Mattu Vadalara Niddura Mattu Vadalaraa
Aa MatthulonaBadithe Gammatthuga Chittavudura
Mattu Vadalara Niddura Mattu Vadalaraa
మత్తు వదలరా Song
Mattu Vadalara Song Lyrics in Telugu
అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి
అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి
ముందుచూపు లేనివాడు ఎందునకూ కొరగాడు
సోమరియై కునుకువాడు… సూక్ష్మమ్ము గ్రహించలేడు
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
మత్తు వదలరా… నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోనబడితే… గమ్మత్తుగా చిత్తవుదువురా
మత్తు వదలరా… నిద్దుర మత్తు వదలరా
జీవితమున సగభాగం… నిద్దురకే సరిపోవు
జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగభాగం… చిత్తశుద్ధి లేకపోవు
అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు
అతినిద్రాలోలుడు… తెలివిలేని మూర్ఖుడు
పరమార్ధం గానలేక వ్యర్ధంగా చెడతాడు
మత్తు వదలరా… నిద్దుర మత్తు వదలరా
సాగినంత కాలమ్ము నా అంత వాడు లెడందురు
సాగకపోతే ఊరక… చతికిలబడి పోదురు
కండబలము తోటే ఘనకార్యము సాధించలేరు
బుద్ధిబలము తోడైతే… విజయమ్ము వరింపగలరు
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
చుట్టు ముట్టు ఆపదలను… మట్టుబెట్టబూనుమురా
చుట్టు ముట్టు ఆపదలను… మట్టుబెట్టబూనుమురా
పిరికితనము కట్టిపెట్టి… ధైర్యము చేపట్టుమురా
కర్తవ్యం నీ వంతు… కాపాడుట నా వంతు
కర్తవ్యం నీ వంతు… కాపాడుట నా వంతు
చెప్పడమే నా ధర్మం… వినకపోతే నీ ఖర్మం
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోనబడితే… గమ్మత్తుగా చిత్తవౌదువురా
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా