Moodu Moodu Kannuloda Shivayya Lyrics కమల్ ఇస్లావత్ రచించగా మంగ్లీ, బిక్షమమ్మ, ఇంద్రావతి చౌహన్, మౌనిక యాదవ్ ఈ శివరాత్రి పాటను ఆలపించారు.
Moodu Moodu Kannuloda Shivayya Song Credits
Music: Madeen SK
Lyrics: Kamal Eslavath
Singers: Mangli, Bikshamamma, Indravathi Chauhan, Mounika Yadav
Producer: Damu Reddy
Label: Speaker
Moodu Moodu Kannuloda Shivayya Lyrics in Telugu
మూడు మూడు కన్నులోడా శివయ్య
ముల్లోక పాలకుడా శివయ్య
మహా దేవాది దేవా శంకర
అడ్డ అడ్డ బొట్టులోడా శివయ్య
అండ పిండమైనవాడ శివయ్య
అర్థ నారీషుడా రావయ్యా
వల్లకాడే ఇల్లు నీకు భూతపాలుడా
వల్ల కానిదంటు లేనేలేని సోమనాథుడ
ఒళ్లు బూడిదల్లు పూసుకున్న దేవుడా
నల్లనాగు మెడల సుట్టుకున్న నీలకంఠుడా
దయాకర, దిగంబర, హరోంహర మహేశ్వర
గంగ నెత్తికెత్తినోడా…
గంగ నెత్తికెత్తినోడా శివయ్య
గౌరిదేవి మెచ్చినోడా శివయ్య
గండాలు బాపెటోడా శంకర
భయము లేని భైరవుడా శివయ్య
గంభీర దేహమోడా శివయ్య
భంభోలనాధుడా శంకరా
మోదుగు మొగ్గలిత్తు శివయ్య
మారేడు రెమ్మలిత్తు శివయ్య
మనసువెట్టి మొక్కుకుందు శంకర
లింగాన చెంబు నీళ్లు పోయంగ
చెరపవయ్య చేదులన్ని శివయ్య
బాపవయ్య బాధలన్నీ శంకర
నాగమల్లె పూలు నీకు నాగభరణుడా
తెల్లమల్లె అల్లి జిల్లేడు దేత్తు శివుడా
పాలకాయ కొడుదునయ్య ఫాలనేత్రుడా
పాహి పాహిమంటు వేడుకుందు పాపహారనుడా
దయాకర దిగంబర హరోంహర మహేశ్వర
జోడు కోడె మొక్కులోడా….
జోడు కోడె మొక్కులోడా శివయ్య
జోలెవట్టి తిరిగేటోడా శివయ్య
జోరు జోరు జంగమూడా శంకర
లావు లావు జడలవాడా శివయ్య
లావు కోపమేల నీకు శివయ్య
లావు జాలి గుణములోడా శంకర
ఎండి ఎండి కొండలోడా శివయ్య
సిక్కనైన కండలోడా శివయ్య
ఎంత మంచి మనసునీదో శంకర
మేలి మేలి నవ్వులోడా శివయ్య
మేలు కీడులెంచేటోడా శివయ్య
తేడా వస్తే ముంచేటోడా శంకర
అంబరీష నంది నీకు వాహనమ్ముగా
అంబ పార్వతమ్మ తోడుగుండి నడిపినవుగా
గంగధరుడ నీదు లీల చిత్రమే కదా
లింగరూపులోన లోకమంత ఏలినావుగా
దయాకర దిగంబర హరోంహర మహేశ్వర
పుట్టు జాడ తెలువనోడా…
పుట్టు జాడ తెలువనోడా శివయ్య
పట్టు విడుపు తెలిసినోడా శివయ్య
పట్టు బట్ట లెరగనోడా శంకర
పంచభూత పాలకుడా శివయ్య
పాపమెల్ల మోసెటోడా శివయ్య
నిన్ను మించి దైవమేడా శంకర
శూలమొక్కసేత వట్టి శివయ్య
ఢమరుకాల మోత వెట్టి శివయ్య
సృష్టిని కాపాడుతావో శంకరా
జింక తోలు మొలకు సుట్టి శివయ్య
కంచు గజ్జె కాళ్ల గట్టి శివయ్య
పరవశించి ఆడుతావో శంకర
దిక్కు ధీము నీవెనయ్య భీమ శంకర
మొక్కుకున్న వారికెల్ల మోక్షమిచ్చే నా దొర
ఒక్క పొద్దులుంటే చాలునంట ఈశ్వరా
కోరకన్న ముందే వరములిచ్చే భోళ శంకర
దయాకర దిగంబర హరోంహర మహేశ్వర
అందు ఇందు ఏడ సూడా…
అందు ఇందు ఏడ సూడా నువయ్య
అంతులేని సూపులోడా శివయ్య
అంతరంగమెరిగినోడా శంకర
అందముల్ల చంద్రరూపం నీదయ్య
అందుకోను దీప దూపం రావయ్య
రామసక్కని సోమా సుందరా…