Mudu Rangula Jenda Patti Lyrics – మూడు రంగుల జెండా పట్టి

0
Mudu Rangula Jenda Patti Lyrics
Pic Credit: Telangana Poster (YouTube)

Mudu Rangula Jenda Patti Song Lyrics penned & music composed by Charan Arjun, and sung by Nalgonda Gaddar. Revanth Reddy Song Lyrics.

Mudu Rangula Jenda Patti Song Credits

Singer Narsanna
Lyrics Charan Arjun
Music Charan Arjun
Song Source

Moodu Rangula Jenda Batti
Singamole Kadhilinaadu
Aggaro Congres Sooryudu
Mana Revanthannaa
Niggadeesi Adige Monagaadu

Mudu Rangula Jenda Patti Lyrics

మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
అగ్గరో కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా.
నిగ్గదీసి అడిగే మొనగాడు.

బీడు భూమున వానైతాడు
బీద సాదల ధైర్యం వీడు
దొంగ దొరల భరతం పడతాడు
మన రేవంతన్నా,
పేద ఇంటికి పండగ తెస్తాడు.

సోనియమ్మ దీవెనతోని
రాహులన్న సైనికుడయ్యి
పెద్ద కొడుకై యుద్ధము జెయ్య
సిద్ధమాయే రేవంతన్న.

మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
అగ్గరో కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా.
నిగ్గదీసి అడిగే మొనగాడు.

దాడులేన్ని జరిగిన గానీ
దడువలేదు రేవంతన్న
అంతకంతా ఎత్తుకు ఎదిగాడో
అసలాటనే లే మొదలంటున్నాడో.

ఒక్కనాడు ఊకోలేదు
ఒక్కడయ్యి కొట్లాడాడు
అందుకే పెద్ద నాయకుడయ్యాడో
(అన్న అందరీ బంధువులా ఎదిగాడు)

అమరవీరుల త్యాగం జూసి
అమ్మ సోనియా చలువతోటి
వచ్చినా మన తెలంగాణ రక్షణే
ధ్యేయమంటున్నాడో…

మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
అగ్గరో కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా,
నిగ్గదీసి అడిగే మొనగాడు…

అహమంటూ లేనివాడు
అందరిని కలిపేటోడు
ఆనాటి రోజులు తెస్తాడో
(మన ఆశలన్నీ తీర్చే నాయకుడో)

ఇందిరమ్మా రాజ్యం మళ్ళీ
రేవంతు వల్లే సాధ్యం
మనవంతుగ అన్నకు తోడుగ ఉందాం
(మన ఉద్యమానికి సిద్ధం అయిపోదాం)

తెలంగాణ పులి బిడ్డ
మరువబోదు నిన్నీగడ్డ
జై జై మా రేవంతన్న గన్నది
మన తెలంగాణో…

మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
అగ్గరో కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా
నిగ్గదీసి అడిగే మొనగాడు….

రాజ్యమొచ్చి ఏడేండ్లాయే
రాతలింకా మారకపాయే
మోసగాడి సేతుల జిక్కింది
(రాష్ట్రం మొదటికన్నా హీనం అయ్యింది)

నాటి నుండి నేటి వరకు
ధీటుగా నిలదీస్తున్నాడు
మేలుకోరా తమ్మి ఇపుడైనా
(అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడో)

గుండెనిండా దమ్మున్నోడు
కొండనైనా ఢీ కొడతాడు
ఆడు ఎవ్వడు, ఈడు ఎవడు
అందరం రేవంతూ వెంటే

మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
అగ్గరో కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా
నిగ్గదీసి అడిగే మొనగాడు….

Dev P
I am Dev P, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.