#Nani27 నాని 27వ చిత్రం టైటిల్ ను సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం ప్రకటించింది. నాని పుట్టినరోజు పురస్కరించుకొని తన తదుపరి చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ అనే ఒక పవర్ ఫుల్ టైటిల్ పాత్రను పోషించనున్నాడు.
యూట్యూబ్ వేదికగా నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ కొంచెం విభిన్నంగా చిత్ర టైటిల్ ‘శ్యామ్ సింగ రాయ్’ అని 59 సెకన్ల వీడియో విడుదల చేసింది. ‘టాక్సీ వాలా’ చిత్ర దర్శకుడు రాహుల్ సంకృతన్ ఈ సినిమాకు దర్శకుడు. భీష్మ చిత్ర నిర్మాతలే ఈ చిత్రాన్నీ నిర్మిస్తున్నారు.
వరుస సినిమాలతో నాని ఇప్పటికే బిజీగా ఉన్నారు. 25వ చిత్రం ‘వి’, 26వ చిత్రం ‘టక్ జగదీష్’ ఇప్పుడు ‘శ్యామ్ సింగ రాయ్’. అయితే ఈ చిత్రంలో సాయి పల్లవి నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.