నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో యాక్షన్ థ్రిల్లర్ ‘వి’. సోషల్ మీడియా వేదికగా నిర్మాత దిల్ రాజు సినిమా
టీజర్ ను విడుదల చేశారు ఈరోజు (17/02/2020). సుధీర్ మరియు నానిల మధ్య వచ్చే సంభాషణలు ప్రేక్షకులను
ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా టైటిల్ ‘వి’ అంటే వి ఫర్ విలన్ అనుకోవచ్చేమో.
నాని ప్రతినాయకుడి ఛాయలు ఉన్న పాత్రలో కనిపిస్తున్నట్టు ఉంది. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ ‘ఫూల్స్
మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్.. అప్పుడప్పుడూ నాలాంటోడు కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తుంటాడు అంతే’ అంటూ చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది.
టీజర్ చివర్లో సుధీర్‌బాబును ఉద్దేశిస్తూ నాని ‘న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడ్డానికి నువ్వు వస్తున్నావనగానే విజిల్స్ వేయడానికి నేనేమి నీ ఫ్యాన్‌ని కాదురా’ అని చెప్పగానే సినిమా టైటిల్ ‘వి’ పడుతుంది… అంటే విలన్ అనుకోవచ్చా, ‘సోదాపు.. దమ్ముంటే నన్నాపు’ అనే డైలాగులు సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అదితిరావు, నివేత థామస్ కథానాయికలు. వి చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Read Also: ‘భీష్మ’ ట్రైలర్