Ne Yennala Edu Chusi Jaanu Folk Song Lyrics penned by Raghu Nimmala, sung by Suman Badanakal & Srinidhi, and music composed by Kalyan Keys.
Ne Yennala Edu Chusi Jaanu Folk Song Credits
Song Category | Telangana Folk Song Lyrics |
Lyrics | Raghu Nimmala |
Singers | Suman Badanakal, Srinidhi |
Music | Kalyan Keys |
Music Lable | SAGAR TUNES |
Ne Yennala Edu Chusi Jaanu Folk Song Lyrics
మనసుల మనసుంటలేదు
వయసు మాట ఇంట లేదు
కడుపుల కూడుంటలేదు
కనులకు కునుకైనా రాదు…
నా రోకంత నీ మీదే జాను
నువ్ లేకుంటే నేనేమైపోను
నా రోకంత నీ మీదే జాను
నువ్ లేకుంటే నేనేమైపోను….
నీ యేన్నెల ఈడును జూసి
మందిల సైగాలు జేస్తే
సందుల సాటుకు వచ్చి
సీకటి సోకులు జేసే…
అందరిలాంటి దానను కాను
నా జోలికొస్తే నేనురుకోను
అందరిలాంటి దానను కాను
నా జోలికొస్తే నేనురుకోను….
కన్నోళ్లే కాదనన్న కులపోల్లే కావాలున్న
తొడగొట్టి సెప్పుతున్న నీ నుదుట బోట్టునైత
ఇగ అద్దంటే ఆగేదే లేదు…
అల్లు అర్జునులా తగ్గేదే లేదు
అద్దంటే ఆగేదే లేదు…
అల్లు అర్జునులా తగ్గేదే లేదు
మూడుపూట ముచ్చట్లు
ఎన్ని చూస్తాలే నేడు
వాడుకొని వదిలేసే నీలాంటి మగవాళ్ళు
దమ్ముంటే మా వోళ్లతో సారు…
అంత సీనుంటే మాట్లాడి సూడు…
దమ్ముంటే మా వోళ్లతో సారు…
అంత సీనుంటే మాట్లాడి సూడు…
నువ్వు లేని నా గుండె ఆగిపోత అంటుందే
నిను పొందని నా జన్మే మల్ల పుట్టనంటుందే
చల్ యెట్లైతే అట్లాయే జానూ….
మీ వోళ్ళతో నే మాట్లాడుతాను
యెట్లైతే అట్లాయే జానూ…
మీ వోళ్ళతో నే మాట్లాడుతాను
పిలగ సిగ్గు లేక రమ్మంటే
ఇంటికొస్తావా ఇంతే
ఎవలైన చూసనంటే నెత్తినిందలు అంతే
రామా దండాలు నీకు సామి…..
రాసిపెట్టుంటే అయితదిలే పెండ్లి
రామా దండాలు నీకు సామి…
రాసిపెట్టుంటే అయితదిలే పెండ్లి
ఒక్కసారి సోపతైతే సచ్చేదాకా ఇడిసిపోను
నమ్మబుద్ధి కాకపోతే గుండె కోసి ప్రేమ జూడు
అబ్బా… నువ్వే నా జీవితమే జాను
జన్మ జన్మలదే మన అనుబంధాము
నువ్వే నా జీవితమే జాను
జన్మ జన్మలదే మన అనుబంధాము
మూలకున్న దాన్ని నన్ను
ముగ్గులోకి దింపినావు
మందిలున్న మనసునంతా
ముంచి ముద్ద చేసినావు
ఇగ నుండి నువ్వే నా షాను
దుమ్ము దులిపేద్దాం రావోయ్ దునియాను
ఇగ నుండి నువ్వే నా షాను…
ఏది ఏమైనా నీతోనే నేను…