Nee Kallu Rammante Song Lyrics in Telugu & English – Vidya vasula Aham

Nee Kallu Rammante Song Lyrics

Nee Kallu Rammante Song Lyrics కిట్టు విస్సాప్రగడ అందించగా, కల్యాణి మాలిక్ సంగీత సమర్పణలో హరిచరణ్ మరియు గీత మాధురి పాడిన ఈ పాట ‘విద్య వాసుల అహం’ చిత్రంలోనిది.

Nee Kallu Rammante Song Lyrics in English

M: Nee Kallu Rammante
Ne Venta Vasthunte
Oorinchake Pranama
Manasaagadam Saadhyamaa.

Nee Kallu Rammante Song Lyrics in Telugu

అ: నీ కళ్ళు రమ్మంటే
నే వెంట వస్తుంటే
ఊరించకే ప్రాణమా
మనసాగడం సాధ్యమా

ఆ: శ్వాసల్లో వేగాలు
సైగల్లో అర్ధాలు
మౌనాలు రాగాలుగా
మారేను నీ తోడునా

అ: ఉలుకు పలుకు లేని
ఈ సమయం ఏమంది
నీ ఉడుకు పరుగు చేరి
తొందరనే పెంచింది

ఆ: నువ్ అవునంటే నే కాదంటుంటే
పోటే పడితే బాగుంటుంది
దూరాలన్నీ దూరం చేసే మాయల్లా
గాలి చేరి బారుంటుందా మాపులులా

అ: హద్దంటూ లేదంటా
వద్దన్న మాటుందా
నా ఊపిరే వేడిగా
నీ ముద్దుగా మార్చగా

ఆ: ఇష్టంగా నీ వేళ్ళు
తాకేందుకే కురులు
ఈ జోరులో వెళ్ళగా
వానల్లే జారాయిగా

అ: పరదా జరిపే వేళ
ఈ సరదా ఏమంది
ఆ పనిలో పనిగా లెమ్ము
దగ్గరగా రమ్మంది…

ఆ: నువ్ అవునంటే నే కాదంటుంటే
పోటే పడితే బాగుంటుంది
దూరాలన్నీ దూరం చేసే మాయల్లా
గాలి చేరి బారుంటుందా మాపులులా…

అ:సందేహమే లేని సందర్భమే చేరి
సందేశమే అందగా
సంభాషణే చాలుగా

ఆ: ఇన్నాళ్ళుగా లేని
ఈ కొత్త కంగారు
తొలిసారి ఏమరపాటునా
మలిసారి అలవాటుగా

అ: తరిమి తరిమి ఆశ
గుండెల్లో చేరింది
హే తడిమి తడిమి నిన్ను
నాలో దాచాలంది

ఆ: నువ్ అవునంటే నే కాదంటుంటే
పోటే పడితే బాగుంటుంది
దూరాలన్నీ దూరం చేసే మాయల్లా
గాలి చేరి బారుంటుందా మాపులులా

Watch నీ కళ్ళు రమ్మంటే Song

Nee Kallu Rammante Song Lyrics Credits

Vidya Vasula Aham Released Date – 17th May 2024
DirectorManikanth Gelli
ProducersLakshmi Navya, Mahesh Datta
SingersHaricharan, Geetha Madhuri
MusicKalyani Malik
LyricsKittu Vissapragada
Star CastRahul Vijay, Shivani Rajasekhar
Music Label

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *