Niggadeesi Adugu Song Lyrics from the movie Gayam (1993). Lyrics by Siri Vennela Seetha Ramasasthry and sung by S.P. Balasubrahmanyam.
Niggadeesi Adugu Song Lyrics In Telugu
సినిమా: గాయం (22 April 1993)
దర్శకుడు: రాంగోపాల్ వర్మ
సంగీతం: శ్రీ
లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ఎస్ పీ బాలసుబ్రమణ్యం
తారాగణం: జగపతిబాబు, రేవతి, ఊర్మిళ
ఆడియో: టీ-సీరీస్ తెలుగు-లహరి మ్యూజిక్
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..
మారదు లోకం.. మారదు కాలం…
దేవుడు దిగి రాని ఎవ్వరు ఏమై పోని..
మారదు లోకం మారదు కాలం…
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి..
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి..
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం..
ఏ క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం…
రామబాణమార్పిందా రావణ కాష్ఠం..
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం..
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..
మారదు లోకం.. మారదు కాలం…
పాత రాతి గుహలు.. పాల రాతి గృహాలయినా..
అడవి నీతి మారిందా.. ఎన్ని యుగాలయినా…
వేట అదే.. వేటు అదే.. నాటి కధే అంతా..
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా…
బలవంతులె బ్రతకాలని.. సూక్తి మరవకుండా
శతాబ్ధాలు చదవలేదా.. ఈ అరణ్యకాండ..
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..
మారదు లోకం.. మారదు కాలం…
దేవుడు దిగి రాని ఎవ్వరు ఏమై పోని..
మారదు లోకం మారదు కాలం…
Listen — Niggadeesi Adugu Song
Niggadeesi Adugu Song Lyrics In English
Niggadeesi Adugu.. Ee Siggu Leni Janaanni..
Aggithoti Kadugu.. Ee Samaaja Jeevachhavaanni…
Maaradhu Lokam.. Maaradhu Kaalam..
Devudu Dhigi Raanee.. Evvaru Emaiponi..
Maaradhu Lokam.. Maaradhu Kaalam..
Gaali Vaatu Gamanaaniki Kaali Baata Dheniki..
Gorre Dhaatu Mandhaki Nee Gnaana Bodha Dheniki..
Ye Charitra Nerchukundhi Pachhani Paatam..
Ye Kshanaana Maarchukundhi Jitthula Maargam…
Raama Baanam Arpindha.. Raavana Khaashtam..
Krishna Geetha Aapindha.. Nithya Kurukshetram..
Niggadeesi Adugu.. Ee Siggu Leni Janaanni..
Aggithoti Kadugu.. Ee Samaaja Jeevachhavaanni…
Maaradhu Lokam.. Maaradhu Kaalam..
Paatha Raathi Guhalu.. Paala Raathi Gruhaalainaa..
Adavi Neethi Maarindhaa.. Enni Yugaalainaa
Veta Adhe.. Vetu Adhe.. Naati Kathe Anthaa..
Nattaduvulu Nadi Veedhiki Nadichosthe Vinthaa…
Balavanthule Brathakaalani.. Sookthi Maravakundaa..
Shathabhdaalu Chadavaledha.. Ee Aranya Kaanda..
Niggadeesi Adugu.. Ee Siggu Leni Janaanni..
Aggithoti Kadugu.. Ee Samaaja Jeevachhavaanni…
Maaradhu Lokam.. Maaradhu Kaalam..