Home » The Greatest Of All Time Telugu » Ninnu Kanna Kanule Song Lyrics in Telugu – The Greatest Of All Time

Ninnu Kanna Kanule Song Lyrics in Telugu – The Greatest Of All Time

by Devender

Ninnu Kanna Kanule Song Lyrics రామజోగయ్య శాస్త్రి అందించగా, యువన్ శంకర్ రాజా సాహిత్యానికి ఎస్ పి చరణ్, చిత్ర మరియు యువన్ పాడిన ఈ పాట ‘ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రంలోనిది.

Ninnu Kanna Kanule Song Lyrics

నిన్ను కన్న కనులే మెరిసెనుగా
కన్నపేగు మరలా మురిసెనుగా
నిన్నలన్ని వరమై కురిసెనుగా
గుండెలన్ని తేనెలో తడిసెనుగా

నేనే… నిన్ను చెయ్యార పెంచని అమ్మ
నీవే… కదా కోట్లాది అమ్మల ప్రేమ

పసివాడా పసివాడా
ఏళ్ళెదిగిన పసివాడా
కలలాగా కలిసావే
నిన్నిక వీడెను గ్రహణపు నీడ

నిన్నటికి ఇప్పటికి
నీలో లేదే తేడా
పసినవ్వులు రువ్వినది
నీ పెదవులపై నీ మీసము కూడా

నిన్ను కన్న కనులే మెరిసెనుగా
కన్నపేగు మరలా మురిసెనుగా
నిన్నలన్ని వరమై కురిసెనుగా
గుండెలన్ని తేనెలో తడిసెనుగా

తడి తగలని పుడమికి నేడూ
చిరు చినుకే నీ రాకా
జనుమలో ఇది జన్మం
ఇక లోటేది నువు చేరాకా

రక్తబంధమొచ్చి బలమిచ్చాక
యుద్ధ విజయము ఖాయమికా
ఏ పొగరిటు రాగలదికా
మన చేతులు కలిసాకా

సద్దే లేనే లేని
నీరెండంటే నీవే
అలసిన గుండెల నిండా
నువు ఆనందాలను పొదిగావే

పసివాడా పసివాడా
ఏళ్ళెదిగిన పసివాడా
కలలాగా కలిసావే
నిన్నిక వీడెను గ్రహణపు నీడ

ఆహా..! ఇదేం వాస్తవం
కలలా ఉందే ఈ క్షణం
నాతో ఇలా ఉన్నది నీవేనా నిజమేనా

చెలియా నిన్నే కలవడం
కాలాలనే గెలవడం
కనుపాపలో కాంతిగా
నీవేనా నిజమేనా

చిరునామా తెలిసిన చిలకల్లే
ఎదగూటిలో వాలావే
కాలం కదలికలేవైనా
నిలిచావే నీలానే

పోదా… పసివారై నిన్నల్లోకి
ఉందా… ఆ చోటే మనం ఎన్నటికీ

నిన్ను కన్న కనులే మెరిసెనుగా
కన్నపేగు మరలా మురిసెనుగా
నిన్నలన్ని వరమై కురిసెనుగా
గుండెలన్ని తేనెలో తడిసెనుగా

Watch నిన్ను కన్న కనులే Lyrical Video

Ninnu Kanna Kanule Song Lyrics Credits

MovieThe Greatest Of All Time Telugu (05 Sep 2024)
DirectorVenkat Prabhu
ProducersKalpathi S Aghoram, Kalpathi S Ganesh, Kalpathi S Suresh
SingersSP Charan, Yuvan Shankar Raja & Chitra
MusicYuvan Shankar Raja
LyricsRamajogayya Sastry
Star CastThalapathy Vijay, Prashanth, Prabhudeva, Sneha, Laila, Meenakshi Chaudhary
Music LabelT-Series Telugu

You may also like

Leave a Comment