Nuvve Kavali Dialogues Lyrics – Trivikram Dialogue Writer

0
Nuvve Kavali Dialogues Lyrics
Pic Credit: idlebrain.com

Nuvve Kavali Dialogues Lyrics, Nuuve Kavali movie was released in 2000 and directed by K. Vijaya Bhaskar, produced by Ramoji Rao & Sravanthi Ravikishore under Ushakiran Movies. It was a remake of the Malayalam film Niram. The movie stars Tarun, Richa Pallod, Sai Kiran, and Varsha in the lead roles. The dialogues were written by Trivikram Srinivas, who is known for his witty and powerful lines.

MovieNuvve Kavali (13 October 2000)
DirectorVijaya Bhaskar
ProducersSravanthi Ravi Kishore, Ramoji Rao
MusicKoti
DialoguesTrivikram Srinivas
Star CastTarun, Richa Pallod

Nuvve Kavali Dialogues Lyrics in Telugu

Nuvve Kavali was a blockbuster hit and won several awards, including the National Film Award for Best Feature Film in Telugu and four Filmfare Awards South. Here are some of the dialogues from the movie.

పాలంటే ఎలర్జీ, కానీ పాలే ఎనర్జీ.

నీకు ఉదయమే అయింది, నాకు జ్ఞానోదయం కూడా అయింది.

గుర్రాలతో రన్నింగ్ రేసు గాడిదలతో వెయిట్ లిఫ్టింగు, ఆడవాళ్ళతో ఆర్గ్యూమెంట్లు నెగ్గలేం

రోగిష్ఠి తల్లి, పాపిష్టు తండ్రి, లేచిపోయిన చెల్లెలు, పారిపోయిన తమ్ముడు, తప్పనిసరి అప్పులు, చెరపలేని అప్పులు… ఈ బాధలన్నీ మర్చిపోవడానికి అప్పుడప్పుడు ఓ ‘టీ’, ఎప్పుడైనా ఓ సిగరెట్టు కాల్చాలనుకోవటం తప్పా.

Nuvve Kavali Dialogues Lyrics

ప్రేమ అనేది ఎక్కాల పుస్తకంలో లెక్క లాంటిది. రెండు మనసులు కూడి, ఇద్దరు మనుషుల్ని తీసేసి, ఆనందాన్ని గుణకారం చేసి, దు:ఖంతో డివైడ్ ప్రేమ అనే శేషం మిగులుతుంది. అదే మనం తప్పుగా మనసుల్ని తీసేసి, మనుషుల్ని కూడి, స్వార్థాన్ని గుణించి, వ్యర్థంగా డివైడ్ చేస్తే, అర్థం లేని సున్నాగా మారిపోతుంది.

ఇంకు లేకుండా పెన్ను ఉంటుందా, పెంకు లేకుండా ఇల్లుంటుందా.

ప్రేమంటే కంట్లో ఉండే పుట్టుమచ్చ లాంటిది
మనకు కనిపించదు ఎదుటివాళ్లకు మాత్రమే తెలుస్తుంది.

మంట దూరంగా ఉంటే వేడి తెలియదు.
మనిషి దగ్గరగా ఉంటే ప్రేమ తెలియదు.

ఇష్టముంటే భయపడకూడదు.
భయముంటే ఇష్టపడకూడదు.
ఇష్టపడి, భయపడితే బాధపడకూడదు.

Nuvve Kavali Dialogues Lyrics

నన్నెప్పుడు చూడాలనిపించినా ఒక్కసారి కళ్ళుమూసుకో
గుండె చప్పుడు నీకు వినిపించేంత దూరంలో నేనుంటాను.

భగవద్గీతలో కృష్ణుడేం చెప్పాడు..?
నాకు ఆయనతో పెద్దగా పరిచయం లేదులే, నీకేమైనా చెప్పాడా?
దీపం వెలిగిస్తే మంచం కింద దాచుకోకూడదు, గూట్లో పెట్టాలి అని చెప్పాడు.

అమ్మో, రోజు చదివితే అలవాటైపోద్ది.
పండగ రోజు రాకూడదు, మనం రోజు చదవకూడదు.

నువ్ కనిపిస్తే నీతో చాలా మాట్లాడాలనుకుంటాను
కానీ ఎదురుగా నువ్వుంటే ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు.

అన్నదమ్ములు విడిపోవాలంటే ఆస్తిపంపకాలు ఉన్నాయి,
మొగుడు పెళ్ళాలు విడిపోవాలంటే విడాకులున్నాయి,
కానీ నిజమైన స్నేహితులు విడిపోవాలంటే–చచ్చిపోవాలంతే.

ఇన్నాళ్ళు ఒకమ్మాయిని ప్రేమించానని చెప్పడమే కష్టమనుకున్నాను.
కాని, ప్రేమించట్లేదు అని చెప్పడం అంతకంటే కష్టమని ఇప్పుడే తెలుస్తుంది.

కాలేజీలో చదువుతున్నప్పుడు ఇంకెప్పుడైపోతుందా అనిపిస్తది,
వెళ్లిపోతుంటే ఇంకొన్నాళ్ళు ఉండాలనిపిస్తది.

వెళ్లిపోవడం తప్పదని తెలిసినప్పుడు
ఎంత తొందరగా వెళ్లిపోతే అంత మంచిది.

మనసులో ఉన్న మనిషి పక్కన మామూలుగా తిరగడం కష్టం..!

ప్రేమకు స్నేహం కంటే గొప్ప పునాది లేదు.

నువ్వొస్తావని తెలుసు కాబట్టి వెయిట్ చేసాను,
నువ్వెప్పుడొస్తావో తెలియనప్పుడు వెయిట్ చేసి ఏం లాభం.

విడిపోవడం తప్పనప్పుడు
అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది.

గొంతులో ఉన్న మాటైతే నోటితో చెప్పొచ్చు,
కానీ గుండెలో ఉన్న మాట కళ్లతోనే చెప్పగలం.

స్నేహం కలిసి తిరగడానికి, కలిసి బ్రతకడానికి కాదు.

నిన్నొదిలేస్తేగా నేను బాధపడడానికి.

Dev P
I am Dev P, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.