O Bujjammaayi Song Lyrics – KA Telugu Movie

O Bujjammaayi Song Lyrics

O Bujjammaayi Song Lyrics శనపతి భరద్వాజ్ పాత్రుడు అందించగా, సామ్ సీఎస్ 
 సంగీతం సమకూర్చగా, శరత్ సంతోష్ పాడిన ఈ పాట ‘క’ చిత్రంలోనిది.

O Bujjammaayi Song Credits

KA Released Date – 31 October 2024
DirectorsSujith & Sandeep
ProducerChinta Gopalakrishna Reddy
SingerSarath Santhosh
MusicSam Cs
LyricsSanapati Bharadwaj Patrudu
Star CastKiran Abbavaram & Others
Music Label & CopyrightSaregama Telugu

O Bujjammaayi Song Lyrics

కనులకు కానుకలా కనబడినావే
కొడవలి చూపులతో కలబడినావే
తలవగ నీవే కలవరమాయే
కలకలమాయే…

ఓ బుజ్జమ్మాయి… ఓ బుల్లమ్మాయి
నీ రెండు కళ్ళు చూడగానే
చిట్టి గుండె చిత్తు చిత్తు
బుజ్జమ్మాయి ఓ బుల్లమ్మాయి
యే గుట్టు రట్టు చెయ్యనట్టి
కట్టు బొట్టు మీద ఒట్టు

మనసు నీదే నెరజాన
అందుకోవే నజరానా
నవ్వు పిట్ట నా మోము వాకిట
వాలింది నీ వలనే

భామ భామ
సత్యభామ సత్యభామ
సొగసే సుతారమ
సత్యభామ సత్యభామ
నడకే నిదానమా
సత్యభామ సత్యభామ
పలుకే ప్రశాంతమా
అందాల సత్యభామా భామా
అంతా నీ మహిమా

ఆ, వంపు సొంపు లింపుగున్న వయ్యారీ
చెంపలోనే కెంపులున్న చింగారీ
దిష్టి చుక్క పెట్టుకోవే సింగారీ, సింగారీ…

ముద్దు ముద్దు మాటలాడు చిన్నారీ
ముచ్చటైన రూపు నీది పొన్నారీ
ముగ్గులోకి దించి నన్ను ముంచావే, కావేరీ…

హే కాపలాగ కాచుకున్న
కాలాన్ని కొల్లగొట్టు మాయలాడివమ్మ
హే చూపురువ్వి చిచ్చురేపే
చందమామవమ్మ

ఓ మిస్సమ్మాయి… కస్సు బుస్సమ్మాయి
నీ రెండు కళ్ళు చూడగానే
చిట్టి గుండె చిత్తు చిత్తు
మిస్సమ్మాయి… కస్సు బుస్సమ్మాయి
యే గుట్టు రట్టు చెయ్యనట్టి
కట్టు బొట్టు మీద ఒట్టు…

మనసు నీదే నెరజాన
అందుకోవే నజరాన
నవ్వు పిట్ట నా మోము వాకిట
వాలింది నీ వలెనే
భామ భామ

సత్యభామ సత్యభామ
సొగసే సుతారమ
సత్యభామ సత్యభామ
నడకే నిదానమా
సత్యభామ సత్యభామ
నన్నే వరించుమా

Watch ఓ బుజ్జమ్మాయి Lyrical Video Song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *