Oke Oka Mata Song Lyrics in Telugu & English – Chakram

0
Oke Oka Mata Song Lyrics

Oke Oka Mata Song Lyrics సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, చక్రీ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన ఈ పాట ప్రభాస్ నటించిన ‘చక్రం’ సినిమాలోనిది.

Oke Oka Mata Song Lyrics in English

Oke Oka Maata
Madhilona Daagundi Mounamga
Oke Oka Mata
Pedavopalenantha Teeyangaa.

Naa Peru Nee Premani
Naa Daari Nee Valapani
Naa Choopu Nee Navvani
Naa Oopire Nuvvani
Neeku Cheppalani…

Oke Oka Mata Song Lyrics in Telugu

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా

నా పేరు నీ ప్రేమనీ
నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని…

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా

నేను అని లేను అని
చెబితె ఏం చేస్తావు
నమ్మనని నవ్వుకొని
చాల్లె పొమ్మంటావు.

నీ మనసులోని ఆశగా… నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్శగా… తగిలేది నేననీ
నీ కంటి మైమరుపులో నను పొల్చుకుంటాననీ
తల ఆంచి నీ గుండెపై నా పేరు వింటాననీ
నీకు చెప్పాలని…

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా

నీ అడుగై నడవడమే
పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే
మరణమన్నది ప్రాణం.

నువు రాకముందు జీవితం
గురుతైన లేదనీ
నిను కలుసుకున్న ఆ క్షణం
నను వొదిలిపోదనీ

ప్రతి ఘడియ ఓ జన్మగా
నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేననీ
నీకైన తెలుసా అనీ
నీకు చెప్పాలని…

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా

నా పేరు నీ ప్రేమనీ
నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని…

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా.

Watch ఒకే ఒక మాట Video Song

Oke Oka Mata Song Lyrics Credits

Movie Chakram (25 March 2005)
Director Krishna Vamsi
Producers C Venkat Raju, Sivaraju
Singer Chakri
Music Chakri
Lyrics Sirivennela Seetharama Sastry
Star Cast Prabhas, Charmy, Asin
Music Label
Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here