Paadana Telugu Paata Lyrics penned by Devulapalli Krishna Sastry Garu, music was composed by GK Venkatesh Garu, and sung Padana Telugu Pata by P Susheela Garu from Telugu cinema ‘America Ammayi‘.
Paadana Telugu Paata Song Credits
Movie | America Ammayi (19 November 1976) |
Director | Singeetam Srinivasa Rao |
Producer | ‘Navata’ Krishnam Raju |
Singer | S P Balasubramanyam, Suseela |
Music | GK Venkatesh |
Lyrics | Devulapalli Krishna Sastry |
Star Cast | Annick Chaymotty, Ranganath, Deepa |
Music Label |
Paadana Telugu Paata Lyrics in English
Paadana Telugu Paata
Paadana Tenugu Paata
Paravashanai Mee Eduta Mee Paata
Paadana Tenugu Paata
Kovela Gantala Ganaganalo
Godavari Tharagala Galagalalo
Kovela Gantala Ganaganalo
Godavari Tharagala Galagalalo
Maavula Thopula Mopula Paina
Masale Gaalula Gusagusalo
Manchi Muthyala Peta
Madhuraamruthaala Teta Oka Paata
Paadana Telugu Paata
Paadana Tenugu Paata
Paravashanai Mee Eduta Mee Paata
Paadana Tenugu Paata
Thyagayya Kshetraya Ramadasulu
Thyagayya Kshetraya Ramadasulu
Thaniviteera Vinipinchinadhee EeEe AaAa Aa
Thyagayya Kshetraya Ramadasulu
Thanivitheera Vinipinchinadhi
Naadu Naadulaa Kadhilinchedhi
Vaadavaadalaa Kariginchedhi
Chakkera Maatala Moota
Chikkani Thenela Oota
Oka Paata Paadana Tenugu Paata
Ollantha Vayyaari Koka
Kallaku Kaatuka Rekha
Ollantha Vayyaari Koka
Kallaku Kaatuka Rekha
Mello Thaali Kaallaku Paaraani
Merise Kumkuma Bottu
Ghallu Ghalluna Kadiyaalandhelu
Allanallana Nadayaade
Tenugu Thalli Pettani Kota
Tenugunaata Prathi Chota Oka Paata
Paadana Tenugu Paata
Paravashanai Nee Paravashanai
Mee Eduta Mee Paata
Paadana Tenugu Paata
Watch పాడనా తెనుగు పాటా Video Song
నవతా కృష్ణంరాజు గారు నిర్మించిన రెండో సినిమానే ఈ ‘అమెరికా అమ్మాయి’. సింగీతం దర్శకత్వంలో తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ఎలుగెత్తి చాటిన ఈ చిత్రానికి కన్నడ అనుకునే తెలుగు సంగీత దర్శకుడు జి.కె.వెంకటేశ్ స్వరాలనందించగా దేవుల పల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం అందించారు.
Paadana Telugu Paata Lyrics in Telugu
పాడనా తెనుగు పాటా
పాడనా తెనుగు పాటా
పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాటా
కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మోపుల పైన
మసలే గాలుల గుస గుసలో
మంచి ముత్యాల పేట
మధురామృతాల తేట ఒక పాట
పాడనా తెనుగు పాటా
పాడనా తెనుగు పాటా
పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాటా
త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినదీ ఈ ఈ ఆ ఆఆ
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినదీ
నాడునాడులా కదిలించేది
వాడవాడలా కరిగించేది
చక్కెర మాటల మూట
చిక్కని తేనెల ఊట
ఒక పాట పాడనా తెలుగు పాట
ఒళ్ళంత వయ్యారి కోక
కళ్ళకు కాటుక రేఖ
ఒళ్ళంత వయ్యారి కోక
కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్ళకు పారణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడే
తెనుగు తల్లి పెట్టని కోట
తెనుగు నాట ప్రతి చోట ఒక పాట
పాడనా తెనుగు పాటా
పరవశనై, నీ పరవశనై
మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాటా