Pacha Pachani Chettura Song Lyrics – song by Gangaputra Narasinga Rao. Telugu Ayyappa Song Lyrics.
Pacha Pachani Chettura Song Credits
Song | Telugu Devotional |
Song By | Gangaputra Narasinga Rao |
Song Label | Mango Music |
Pacha Pachani Chettura Song Lyrics
Pacha Pachani Chetturaa
Chettu Meedha Ramachilukara ||2||
Ramasilaka Nota Ellavelalaa
Swamy Namame Palukuraa
Nee Swamy Namame Palukuraa
||Pacha Pachani||
Okaanoka Rojuna Chilaka
Naasenthaku Vacheraa
Swamy Swamy Antu
Nannu Peru Petti Piluva Saageraa ||2||
Yetamma Chilakamma Yetani Adigithe ||2||
Aakullo Thala Petti Vekki Vekkedchindhi
||Pacha Pachani||
Chinthaleka Chettupaina
Chilakagorinkalaina
Oosulaadukuntu Ee Oore
Marachi Poyinayi ||2||
Atti Aa Jantanu Boyavaadu Choochenu
Chilakammanu Choosi Villu Ekkupettenu
Adhi Choochi Gorinka
ChilakaKadduvachheraa
Gorinka Kantichoopu Chilakaku
Karuvaayeraa ||Pacha Pachani||
Gaayamaina Gorinkaku
Anni Thaanainadhi
Thana Kantithoni Lokaanni
Chooputhunnadhi
Ramachiluka Okanaadu
Swamy Pooja Choochenu
Poojalona Guruswamy
Mahimalenno Cheppenu
Nadavaleni Vaaru
Konda Nadichi Vellaarani
Maataraani Vaaru
Paata Paaduthunnaarani
Choodaleni Vaaru
Jyoti Choochuchunnaarani ||Pacha Pachani||
Attiyaa Raama Silaka
Swamy Maala Veyamani
Nannu Vedukunnadhi
Brathimilaadukunnadhi
Mandala Vrathamunu
Maruvaka Jethunani Thana Irumudini
Naa Thala Meedha Unchamani ||2||
Irumudilona Thanu
Gorinka Vachunani
Mahimala Manikantuni
Kanulaaragaanthumani
Aa Jyoti Darshanam
Gorinkaku Choopamani
పచ్ఛా పచ్చని చెట్టురా
చెట్టు మీద రామచిలుకరా ||2||
రామసిలక నోట ఎల్లవేళలా
స్వామి నామమే పలుకురా
నీ స్వామి నామమే పలుకురా ||పచ్చపచ్చని||
ఒకానొక రోజున చిలక నాసెంతకు వచ్చెరా
స్వామి స్వామి అంటూ
నన్ను పేరు పెట్టి పిలువ సాగెరా ||2||
ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే ||2||
ఆకుల్లో తల పెట్టి
వెక్కి వెక్కేడ్చింది ||పచ్చపచ్చని||
చింతలేక చెట్టు పైన చిలకగోరింకలైన
ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచి పోయినయి ||2||
అట్టి ఆ జంటను బోయవాడు చూచెను
చిలకమ్మను చూసి విల్లు ఎక్కుపెట్టెను
అది చూచి గోరింక చిలక కడ్డువచ్చెరా
గోరింక కంటికి గాయమైనాదిరా
గోరింక కంటిచూపు
చిలకకు కరువాయెరా ||పచ్చపచ్చని||
గాయమైన గోరింకకు అన్ని తానైనది
తన కంటితోని లోకాన్ని చూపుతున్నది
రామచిలుక ఒకనాడు స్వామి పూజ చూచెను
పూజలోన గురుస్వామి మహిమలెన్నో చెప్పెను
నడవలేని వారు కొండనడిచి వెళ్లారని
మాటరానివారు పాట పాడుతున్నారని
చూడలేని వారు
జ్యోతి చూచుచున్నారని ||పచ్చపచ్చని||
అట్టియా రామ సిలక స్వామి మాల వేయమని
నన్ను వేడుకున్నది, బ్రతిమిలాడుకున్నది
మండల వ్రతమును మరువక జేతునని
తన ఇరుముడిని నా తలమీద ఉంచమని ||2||
ఇరుముడిలోన తను గోరింక వచ్చునని
మహిమల మణికంఠుని కనులారగాంతుమని
ఆ జ్యోతి దర్శనం
గోరింకకు చూపమని ||పచ్చపచ్చని||