Home » 2023 Telugu Movies » Padham Parugulu Song Lyrics in Telugu – Maruva Tarama

Padham Parugulu Song Lyrics in Telugu – Maruva Tarama

by Devender

Padham Parugulu Song Lyrics penned by Chaitanya Varma, music composed by Vijai Bulganin, and sung by PVNS Rohit from Telugu cinema ‘Maruva Tarama‘.

ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘మరువ తరమా’. మేకర్స్ ఈ సినిమాలోని మొదటి పాటను (పాదం పరుగులు తీసే) విడుదల చేశారు, చైతన్య వర్మ అందించిన మంచి సాహిత్యానికి విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని సమకూర్చగా పి వి ఎన్ ఎస్ రోహిత్ ఆలపించారు.

అద్వైత్ ధనుంజయ హీరోగా అతుల్యా చంద్ర మరియు అవంతిక హరి నల్వా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహిస్తుండగా గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Padham Parugulu Song Credits

Maruva Tarama Release Date –  2023
Director Chaitanya Varma Nadimpalli
Producers Ramana Murthy Giduturi, Rudraraju N V Vijaykumar Raju
Singer PVNS Rohit
Music Vijay Bulganin
Lyrics Chaitanya Varma
Star Cast Adhvaith Dhanunjaya, Athulya Chandra, Avantika Hari Nalwa
Music Label & Source ©

Padham Parugulu Song Lyrics

Padham Parugulu Teese, Teese Teese
Praanam Urakalu Vese, Vese Vese

Paruvam Parachina Aashe
Praayam Padhamani Tose
Preme Chigurulu Vese
Pedave Kavithalu Raase

Idhivarakerugani Alajadi
Yadhalanu Thaake
Idhiyani Vivaramu Telipe
Samayamu Kaadhe

Adharamaa Kotha Madhurima Kanuma
Hrudayamaa Kontha Shanthamu Padumaa
Kalavaram Kanti Choopula Naduma
Priya Sukham Moya Manasuki Taramaa
Paravashame Parichayame Prathikshaname

Chilipi Vayasataa, Aa AaAa
Chebithe Vinadhataa
Cheliya Piluputho, Oo Oo
Edhalo Chitapataa Aa Aa

Thanatho Saage Kshana Kshanamu
Thanuvu Manasu Thana Paramu
Tanivi Teere Sambaramu
Vayasuke Idhi Avasaramu

Idhivarakerugani Alajadi
Yadhalanu Thaake
Idhiyani Vivaramu Telipe
Samayamu Kaadhe

Manase Tholisaari Premalo Tadisi
Pranyaala Maayalo Murisi
O Kalagaa Kaalame marichi
Cheli Thodu Teesukoni Gathinchene
Vihangame Jagaalane Haayiga Aa Aa Haayigaa

Paadham Parugulu Teese, Theese Teese
Praanam Urakalu Vese, Vese Vese

Paruvam Parachina Aashe
Praayam Padhamani Tose
Preme Chigurulu Vese
Pedave Kavithalu Raase

Idhivarakerugani Alajadi
Yadhalanu Thaake
Idhiyani Vivaramu Telipe
Samayamu Kaadhe

Adharamaa Kotha Madhurima Kanuma
Hrudayamaa Kontha Shanthamu Padumaa
Kalavaram Kanti Choopula Naduma
Priya Sukham Moya Manasuki Taramaa

Paadham Parugulu Telugu Lyrics

పాదం పరుగులు తీసే, తీసే తీసే
ప్రాణం ఉరకలు వేసే, వేసే వేసే

పరువం పరచిన ఆశే
ప్రాయం పదమని తోసే
ప్రేమే చిగురులు వేసే
పెదవే కవితలు రాసే

ఇదివరకెరుగని అలజడి
యదలను తాకే
ఇదియని వివరము తెలిపే
సమయము కాదే

అదరమా కొత్త మధురిమ కనుమా
హృదయమా కొంత శాంతము పడుమా
కలవరం కంటిచూపుల నడుమ
ప్రియసుఖం మోయ మనసుకి తరమా
పరవశమే పరిచయమే ప్రతి క్షణమే

చిలిపి వయసటా, ఆ ఆఆ
చెబితే వినదటా
చెలియ పిలుపుతో, ఓ ఓ
ఎదలో చిటపటా ఆ ఆ

తనతో సాగే క్షణ క్షణము
తనువు మనసు తన పరము
తనివి తీరే సంబరము
వయసుకే ఇది అవసరము

ఇదివరకెరుగని అలజడి
యదలను తాకే
ఇదియని వివరము తెలిపే
సమయము కాదే

మనసే తొలిసారి ప్రేమలో తడిసి
ప్రణయాల మాయలో మురిసి
ఓ కలగ కాలమే మరిచి
చెలి తోడు తీసుకొని గతించెనే
విహంగమై జగాలనే హాయిగా, ఆ ఆ హాయిగా

పాదం పరుగులు తీసే, తీసే తీసే
ప్రాణం ఉరకలు వేసే, వేసే వేసే

పరువం పరచిన ఆశే
ప్రాయం పదమని తోసే
ప్రేమే చిగురులు వేసే
పెదవే కవితలు రాసే

ఇదివరకెరుగని అలజడి
యదలను తాకే
ఇదియని వివరము తెలిపే
సమయము కాదే

అదరమా కొత్త మధురిమ కనుమా
హృదయమా కొంత శాంతము పడుమా
కలవరం కంటిచూపుల నడుమ
ప్రియసుఖం మోయ మనసుకి తరమా

Watch పాదం పరుగులు తీసే Lyrical Video Song

You may also like