Pairu Kotha Paatta Song Lyrics భాస్కర భట్ల అందించగా, జీవి ప్రకాష్ కుమార్
సంగీతాన్ని సమకూర్చగా నారాయణన్ రవిశంకర్ మరియు రమ్య బెహరా పాడిన ఈ పాట ‘తంగలాన్’ చిత్రంలోనిది.
Pairu Kotha Paatta Song Lyrics Credits
Movie | Thangalaan |
Director | Pa. Ranjith |
Producer | K. E. Gnanavel Raja |
Singers | Narayanan Ravishankar, Ramya Behara |
Music | GV Prakash Kumar |
Lyrics | Bhaskara Bhatla |
Star Cast | Vikram, Malavika Mohanan |
Music Label | Junglee Music Telugu |
Pairu Kotha Paatta Song Lyrics
దైవం దీవెనిచ్చే… వరి పైరే కోతకొచ్చే
కన్న కలలు తీరి… నడిచీ ఇంటికొచ్చే
ఒక్కొక్క వడ్ల గింజ బంగారు తల్లేరా
నమ్ముకున్న రైతు కష్టం… నేలే ఎరుగునురా
మట్టితోటి మనిషి జన్మ… ఏనాటి బంధవమ్మా
కట్టెలోన కాలేదాకా… కాలం సాక్షవమ్మా
రక్తమంతా దారబోస్తే… రతనాల సీమ పండే
ఏయ్ హి హెయ్…
ఆమె: హైస్సా హైస్సా…
అతడు : వయ్యారి గాజుల చప్పుడు
తన్నే నన్నానే పిల్ల… తన్నే నన్నానే
అతడు: నను నీవైపు
ఆమె: హైస్సా
అతడు: నను నీవైపు
వెళ్ళు వెళ్ళని నెట్టేస్తున్నాదే…
తన్నే నన్నానే
ఆమె:హోయ్, తన్నే నన్నానే… తన్నే నన్నానే
చుట్టుపక్కలంతా మన చుట్టాలున్నారే
వాళ్ళు, చూస్తా ఉన్నారే
నువ్వు నాతో చెప్పే ఊసే చెంతకొచ్చి
చెవిలో చెబితే బాగుంటాదయ్యా…
ఓ చిన్నా మావయ్యా… ఓ చిన్నా మావయ్యా
అతడు: నువ్ వరిసేను కోస్తావుంటే
నా వయసేదో కూస్తావుందే
ఆమె: నువ్వు కూత ఆపిందెప్పుడూ
నాకు నిద్దరట్టిందెప్పుడూ…
అతడు: అట్ట ఊరుబోయినప్పుడే
మా మావా అనేటప్పుడే…
ఆమె: నిజమా మావా?
అతడు: నిజమేనే…
అతడు: ఆ, అత్తామావల ఏలాకోలం
చూడముచ్చటయ్యేలే
ఆమె:తన్నే నన్నానే… తన్నే నన్నానే
హోయ్, తన్నే నన్నానే… తన్నే నన్నానే
ఆమె: ఓ మావయ్యో..!
బంగారమెడతానని చూపుల్లంటివే
పెళ్లి చూపుల్లంటివే..?
తీరా మండేటి ఎండల్లోనా
మాడుస్తున్నావే…
నన్ను మండేటి ఎండల వెట్టి
మాడుస్తున్నావే…
అతడు: అది కాదే నా బంగారం
పూటకొక్కసారి ఇలా దెబ్బి పొడవకే
ఇట్టా దెబ్బి పొడవకే..!
పండినా పంటని కూడా
బంగారమే అంటారే…
నెత్తిమీద ఎట్టుకుంటే
నువ్వు మెరిసిపోతావే…
ఆమె: మోసుకొని పోతావుంటే
మోపు మీద మోపు
ఎంటపడి వస్తాడమ్మీ
మాయదారి మావా…
అతడు:ఒక్కసారి అంత మోత
కష్టమేగా నీకూ, ఊ ఊ ఊ, హేయ్
ఓహె, ఒక్కసారి అంత మోత
కష్టమేగా నీకూ…!
పడిపోతే కాలు జారి
దిక్కు ఎవరే నీకు..?
అతడు: ఆ సీలుపుడి
ఇట్టా తీసుకురాయే
కుండతో పక్కనెట్టా
వాళ్ళు పోయాక
అంతా కలిసి తిందాం…
తన్నే నన్నానే… తన తన్నే నన్నానే
తన్నే నన్నానే… తన తన్నే నన్నానే
పొద్దు పోతుంది
ఇంకా సానా పనుంది
ఎడ్లు కట్టాలి… కట్టి కుప్పనూడ్చాలి
పొద్దు పోతుంది
ఇంకా సానా పనుంది
ఎడ్లు కట్టాలి… కట్టి కుప్పనూడ్చాలి
తన్నే నన్నానే… తన తన్నే నన్నానే
తన్నే నన్నానే… తన తన్నే నన్నానే