పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ వేళ పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు అందజేసే రూ.6000/- కు సంబంధించి లాక్ డౌన్ ప్యాకేజీ కూడా విడుదల చేసినింది కేంద్ర ప్రభుత్వం.
పీఎం కిసాన్ యోజన పథకం అర్హుల జాబితా
అర్హులైన రైతులకు నేరుగా లబ్ది చేకూరేందుకు పెట్టుబడి సహాయం క్రింద కేంద్ర ప్రభుత్వం నేరుగా ఒక్కో రైతు కుటుంబానికి వారి బ్యాంకు ఎకౌంటుకు రూ.6 వేలు జమచేస్తుంది.
ఇందుకు సంబంధించి లబ్ది దారుల అర్హత జాబితాను కేంద్ర వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ లో పొందుపరిచింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి జాబితాలో నమోదయిన రైతుకు మాత్రమే డబ్బులు అందుతాయి.
అయితే మీపేరు జాబితాలో ఉందో లేదో క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా తెలుసుకోండి.
అర్హుల జాబితా కోసం – ఈ లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి