Rajinikanth Pedarayudu Movie Dialogues Lyrics written by G Satyamurthy Garu. రవిరాజా పినిశెట్టి గారి దర్శకత్వంలో వచ్చిన ‘పెదరాయుడు’ మోహన్ బాబు గారు నిర్మించారు. రజినీకాంత్ గారికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు ఈ చిత్రంలో.
Pedarayudu Cinema Rajinikanth Dialogues Credits
Movie | Pedarayudu (15 June 1995) |
Writer | G. Satyamurthy |
Director | Ravi Raja Pinisetty |
Producer | Mohan Babu |
Music | Koti |
Star Cast | Mohan Babu, Rajinikanth, Soundarya, Bhanupriya |
Video Source |
Rajinikanth Pedarayudu Movie Dialogues Lyrics In Telugu
రజినీకాంత్: ఏరా నీతిలేని కుక్క..! మనకింద పనిచేసే వాళ్లకి తిండి బట్ట ఇచ్చి, అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకొని, నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే, మృగానికి నీకు తేడా లేనేలేదు.
రజినీకాంత్: అరేయ్..! గుళ్ళోకెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్టుకురారా.
ఇదిగో అమ్మాయి ఇలా రా…
ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో, అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడి తీర్పు.
చలపతి రావు: పాపారాయుడు నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవడం మాలాంటి జమిందార్లకు అలవాటే. నేను నీ చెల్లెలి భర్తని, వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందూ వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో…
రజినీకాంత్: ఆపరా..! అంతకుమించి ఒక్కమాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను.
నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు, నా తీర్పుకే ఎదురు చెప్తావా..? ప్రాణాలు తీస్తాను.
బంధాలు, బంధుత్వాలు కాదురా నాకు కావాల్సింది. నాకు కావాల్సింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం, జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం.
ఏయ్..! ఇయ్ రా తాళి… కట్టరా వెళ్ళి.
చలపతి రావు: పాపారాయుడు..!!!
రజినీకాంత్: ఆ ఇంట్లో నీకేది జరిగినా ఈ పాపారాయుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకు.
చలపతి రావు తుఫాకీ తో కాల్చిన అనంతరం
రజినీకాంత్: రాయుడు వద్దు, వద్దు… నా చెల్లెలి పసుపుకుంకాలు తుడిచివేయొద్దు
ఎవరూ వాన్ని తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవించే తీరాలి.
ఈరోజు నుంచి వాన్ని వాడి కుటుంబాన్ని 18 ఏళ్ళ పాటు ఈ ఊరు నుండి వెలేస్తున్నాను. వాళ్ళతో ఎవరూ మాట్లాడకూడదు, వాళ్ళింటి మంచ్చి చెడ్డలకు ఎవ్వరూ వెళ్ళకూడదు. ఆఖరికి, ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. దీన్నెవరూ అతిక్రమించినా, వాళ్లకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు.
రజినీకాంత్: పెదరాయుడు నా బాధ్యత నీకప్పగిస్తున్నాను. తీర్పు చెప్పే వాడి దృష్టిలో అందరూ ఒకటే. న్యాయం మన ఊపిరి.ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో… ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. ఆ, గుర్తుంచుకో.
Watch Rajini Dilagoue – Pedarayudu Cinema
Rajinikanth Pedarayudu Movie Dialogues Lyrics In English
Rajinikanth: Ye Raa Neethi Leni Kukka..! Manakindha Panichese Vaallaki Thindi, Batta Ichhi Andagaa Nilabadi Aashrayam Ivvadam Yajamaanigaa Mana Dharmam. Alaantidhi Ninne Nammukoni, Nee Panchana Padunna Vaalla Padakane Panchukunnaavante, Mrugaaniki Neeku Thedaa Leneledhu.
Rajinikanth: Areyy..! Gullokelli Ammavaari Pasuputhaadu Pattukuraaraa. Idhigo Ammaayi Ilaa Raa.
Ye Chethulatho Ayithe Aa Ammaayi Jeevithaanni Cheshaavo, Adhe Chethulatho Aa Ammaayi Mello Katti Kottha Jeevithaanni Ivvu. Idhe Paparayudi Theerpu.
Chalapathi Rao: Paparayudu Nee Theerpu Maarchu. Ayina Ilaanti Alagaajanamtho Aadukovadam Maalaanti Zamindhaarlaku alavaate. Nenu Nee Chelleli Bharthani, Veedu Maaku Puttina Bidda. Kaastha Mudhu Venaka Aalochinchi Theerpu Ivvadam Nerchuko…
Rajinikanth: Aaparaa..! Anthakuminchi Okkamaata Ekkuva Maatladithe Nee Naaluka Cheeresthaanu.
Naa Kallaloki Sootigaa Maatladadaaniki Bhayapade Nuvvu, Naa Theerpuke Edhuru Chepthaava..? Praanaalu Theesthaanu.
Bandhaalu, Bandhuthwaalu Kaadhuraa Naaku Kaavaalsindhi. Naaku Kaavaalsindhi Neethi, Nyaayam, Dharmam. Puttina Puttuka Kaadhuraa Mukhyam. Naaku Mukhyam, Jarigina Anyaayam Jaragaalsina Nyaayam.
Chalapathi Rao: Paparayudu..!!!
Rajinikanth: Aa Intlo Neekedhi Jariginaa Ee Paparayudu Unnaadanna Sangathi Marchipoku.
Rajinikanth: Rayudu Vaddhu, Vaddhu… Naa Chelleli Pasukumkaalu Thudichiveyoddhu.
Evaru Vaanni Thaakataaniki Veelledhu. Chesina Thappuki Vaadu Shiksha Anubhavinche Theeraali.
Eeroju Nunchi Vaanni Vaadi Kutmbhaanni 18 Yella Paatu Ee Ooru Nundi Velesthunnaanu. Vaallatho Evaru Maatladakoodadhu, Vaallinti Manchi Cheddalaku Evvaru Vellakoodadhu. Aakhariki Vaallontlo Pachhi Manchineellu Koodaa Muttukokoodadhu.
Dheennevaru Athikraminchinaa, Vaallaku Koodaa Idhe Shiksha Varthisthundhi. Idhe Ee Paparayudu Theerpu.
Rajinikanth: Pedarayudu Naa Baadhyatha Neekappagisthunnaanu. Theerpu Cheppe Vaadi Drushtilo Andharu Okate. Nyaayam Mana Oopiri, Dharmam Mana Praanam. Eppudaithe Manam Thappudu Theerpichhaamo, Aa Kshaname Manam Chachhipoyinattu Lekka. Aa, Grthunchuko…