Home » Telangana Folk Song Lyrics » Raleva Bangaram Love Failure Song Lyrics – రాలేవా బంగారం

Raleva Bangaram Love Failure Song Lyrics – రాలేవా బంగారం

Raleva Bangaram Love Failure Song Lyrics penned & music composed by Rajender Konda, sung by Divya Malika from Anu Tune’s new Telangana folk love failure song.

Raleva Bangaram Love Failure Song Credits

LyricsRajender Konda
MusicRajender Konda
SingerDivya Malika
CastShivakrishna Veluthuru, Vishwapriya, Vaishnavi Sony
Song LabelAnu Tune

Raleva Bangaram Love Failure Song Lyrics

వదిలేసావా నన్నిలా
ప్రేమించినందుకు ప్రాణంగా
కాదంటావా నన్నిలా
నా ప్రాణమే నువ్వనుకున్నగా

investment

నా గుండెలోని ఆశని
నువ్వే కాలరాసి పోతివి
నా మనసులున్న మాటని
నీకే చెప్పాలని ఉన్నది
ఒక్కసారి కంటిముందు కానరావ
నా గుండె ఆగుతున్నది

నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారూ
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవో
నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారు
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవో

మనసులున్న మాటను
ఈ ముళ్ళ బాటలో
నీకు సెప్పలేకనే సెయ్యి జారుతున్నాను
గుండెలోని బాధని
నీ గురుతుగ నేనే
పదిలంగ దాసుకున్నా నిను మరువలేకనే

నిన్ను నేను సూడాలని
మాటలెన్నొ సెప్పాలని
సెప్పలేక పోతున్నా
నువ్వులేని నీ సిన్నదాన్ని

నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారూ
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవో
నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారు
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవో

నువ్వస్తవేమని ఎదురుచూస్తు ఉంటిని
నా ఎదలో నిన్నెప్పుడు నే తలసుకుంటిని
నువు రాకపోయినా నీ జ్ఞాపకాలతో
ఎన్నిరోజులని గడపాలో నాకు తెలియదే

పాపమేమి నే జేసినానో
పాపకారి దేవుడు నన్నే
నిన్ను జూడకుండానే
ఉంచినాడు దూరంగానే

నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారూ
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవో
నేను బతిమాలుకుంటున్నా రాలేవ బంగారు
నన్ను సూడాలని ఉన్నా రాలేకపోతున్నవో

Watch రాలేవా బంగారు New Love Failure Video Song

Nenu Bathimaalukuntunna Raaleva Bangaru
Nannu Soodaalani Unna Raalekapothunnavo

Scroll to Top