Home » సినిమా » నితిన్ రంగ్ దే మోషన్ పోస్టర్ విడుదల – Happy Quarantine B’Day Arjun

నితిన్ రంగ్ దే మోషన్ పోస్టర్ విడుదల – Happy Quarantine B’Day Arjun

by Devender

హీరో నితిన్ పుట్టినరోజు పురస్కరించుకొని తన తదుపరి చిత్రం ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. అను మరియు అర్జున్ ల పరిచయం అంటూ ఈ పోస్టర్ విడుదలైంది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రంగ్ దే’ చిత్రంలో నితిన్ కు జంటగా మొదటసారి కీర్తి సురేష్ నటిస్తుంది. వెంకీ కి ఇది మూడవ చిత్రం. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాలకు దర్శకత్వం వహించాడు వెంకీ అట్లూరి.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రంగ్ దే’లో అను గా కీర్తి, అర్జున్ గా అర్జున్ లు నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

భీష్మ ద్వారా మంచి హిట్ అందుకున్న నితిన్ ఈ చిత్రం విజయం ఆశాభావంగా ఉన్నాడు. భీష్మ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

కీర్తి సురేష్ కొంచం కొత్తగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది… Wishing you a Happy quarantine birthday Arjun! అని.

నితిన్ రంగ్ దే మోషన్ పోస్టర్ విడుదల

You may also like

Leave a Comment