Ranganayaki Song Lyrics in Telugu & English – Aay 2nd Single

Ranganayaki Song Lyrics

Ranganayaki Song Lyrics సురేష్ బనిసెట్టి అందించగా, సంగీతాన్ని రామ్ మిరియాల సమకూర్చగా అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట ‘ఆయ్’ సినిమాలోనిది.

Ranganayaki Song Lyrics in English

Mari Nayaki Emainaadhe
Ranganayaki Emainadhe

Ranganayaki Song Lyrics in Telugu

పొట్టేల్ ని గన్న తల్లి…
హెయ్, గొర్రె గొర్రె గొర్రె
తన బోటుకి చిన్న చెల్లి
అది బర్రె బర్రె బర్రె…

అరె చాపను చూస్తే కొంగ
అహ వెర్రే వెర్రే వెర్రే
కోడిపెట్టెను జూసి పుంజు
హ వర్రే వర్రే వర్రే (అయ్ బాబోయ్)

అహ, బూరెలేసే బుజ్జి పద్మావతి, ఓహో
బంగార్రాజు పులిహోర కలిపాడు, ఆహ
పూలు అల్లుతున్న చిట్టి కుమారికి
కోటిగాడొచ్చి జడల్లుతున్నాడు
ముగ్గులు పెట్టే ముత్యాలనేమో
మూర్తిగాడొచ్చి ముగ్గులో దించాడు, ఆహా

మరి నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే

నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
ఓ హో హో హో

నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే, ఎయ్
కో: నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే

కో: ఆహ, ఓహో… ఆహ, అది ఓహో
ఆహ, ఓహో అరరరె అదీ లెక్క

చిలిపి కుర్రాళ్ళు… దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు
ఓ ఓ, చిలిపి కుర్రాళ్ళు… దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు, అరెరె

స్వాతిముత్యాలు కొంచెం జాతిరత్నాలు, ఆహ
పోటీకొచ్చారా ఢీ కొట్టే పొట్టేళ్లు, ఓ

మీసం మెలేసినా ప్రతి ఒక్క కుర్రాడు
కాటుక కళ్ళే చూసి ఫ్లాటైపోతాడు
గాజుల మోతే వింటే లొంగిపోని సిన్నోడు
భూమి దున్నాడంటే నమ్మేదెవ్వడు

మూర మల్లెపూలు కొప్పున చుడితే, ఓహో
ఊరూరంతా నిద్దుర లేసింది, ఆహ
బెత్తెడు నడుము అత్తరు కొడితే
పొలిమేర కూడా పొలమారిపోయింది
పాలట్టుకొచ్చి పక్కన కూచుంటే
కుర్ర ఊపిరంతా వేడెక్కి పోయింది

నాయకి (నాయకి)
ఓ మరి, నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే, ఓ ఓ ఓ

నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే, ఎయ్
కో: నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే

Watch నాయకి ఏమైనాదే Lyrical Video

Ranganayaki Song Lyrics Credits

ఆయ్ Telugu Cinema – 
DirectorAnji K Maniputhra
ProducersBunny Vas and Vidya Koppineedi
SingerAnurag Kulkarni
MusicRam Miriyala
LyricsSuresh Banisetti
Star CastNarne Nithiin, Nayan Sarika
Song Label & Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *