Rangu Seethaammo Part 6 Song Lyrics penned by Parshuram Nagam, music composed by Praveen Kaithoju, and sung by Boddu Dilip & Lavanya. రంగు సీతమ్మో Part 6.
Rangu Seethaammo Part 6 Song Credits
Song Category | Telangana Folk Song |
Director | Parshuram Nagam |
Producer | Shravan Reddy Velma |
Cast | Karthik Reddy, Janu Lyri, Nithu Queen, Nani Patel |
Lyrics | Parshuram Nagam |
Singers | Boddu Dilip & Lavanya |
Music | Praveen Kaithoju |
Music Lable & Credit |
Rangu Seethaammo Part 6 Song Lyrics
గోరు ముద్దలూ వెడితి
గోడ దుంకి వస్తవేళ
గావురంగ చూసుకుంటి
గాయాబు అవుతవేళ అడుగు సీతమ్మో

నీకు జోడి దెస్తమమ్మ
బండెక్కి వస్తడమ్మ
బంతిపూలు తెస్తడమ్మ
గోగిపూలు ఇస్తడమ్మ నా ఈ బిడ్డో
పగడాల దీవినుండి
రెక్కల గుర్రామెక్కి
అద్దాల మేడలోకి నిన్నెత్తుక పోతడమ్మో
సూడవె బిడ్డో
పిలగానితో మాట్లాడుత
అవ్వయ్యతో మాట్లాడుత
కులమతమేదైనా గాని
కోరినట్లు పెండ్లి జేస్త నడువే బిడ్డ
నా బిడ్డ సిరి దేవి
నా బిడ్డ భూదేవి
నా బిడ్డ మారాణి
నా బిడ్డకు అంక లేదు
సూడు బావయ్యో
పసిపిల్లలు గాదు వీళ్ళు
పారిపోయే వాళ్ళు జూడు
పాణాలే పోతవున్నా పట్టించుకోరు వీళ్ళు
సూడు అన్నయ్యో
సిరులిస్తా మణులిస్తా
సిరిపోలు నేను వోస్త
ఆస్తులిస్త పాస్తులిస్త
అడిగినంత కట్నమిస్త సూడు సెల్లెమ్మో
పనిల ఉంది నా బిడ్డ
మాటలుంది నా బిడ్డ
సదువులుంది నా బిడ్డ
సాత్రంలా ఉంది బిడ్డ ఒప్పుకోవమ్మో
ఎక్కించే వాళ్ళుంటరు
పొంగిపోకే నా బిడ్డ
ఎత్తేసే వాళ్ళుంటరు
కుంగిపోకే ఓ బిడ్డ, జాగురత్తమ్మో
సుట్టాలు పక్కాలు
సూసిపోను వస్తుంటరు
ఇరుగిల్లు పొరుగిల్లు
ముచ్చటాడి పోతుంటరు, కలిసిపోవమ్మో
తిండుంటే కండుంటది
కండుంటే పని ఉంటది
పని ఉంటే పైసుంటది
పైసుంటే ఇలువుంటది, ఇగురంగుండే
ఇలువుంటే బతుకుంటది
పదిమందిల తెలివుంటది
ముందుకెళ్లే తెగువుంటది
సంబరాల ఇల్లైతది నా ఈ బిడ్డో
నువ్వుట్టినసంది బిడ్డ
లచ్చిందేవొచ్చినాదే
నువ్వేళ్ళీ పోతే బిడ్డ
నా గుండె వగిలిపాయే, నా ఈ బిడ్డో
కష్టంలా తోడుంటివి
నష్టంలా ఎంటుంటివి
బాధలు పంచుకుంటివి
బైలెల్లి పోవడితివే నా ఈ బిడ్డో
పోయేకాడ ఫైలంగా
వండే కాడ ఫైలంగా
సేనుకాడ ఫైలంగా
సెలకకాడ ఫైలంగా ఉండవమ్మా
నలుగురిలా జాగ్రత్త
నవ్వేకాడ జాగ్రత్త
ఆటకాడ జాగ్రత్త
మాటకాడ జాగ్రత్త నా ఈ బిడ్డో
మీరు సల్లగుండాలె పిల్లపాపాలతోటి
మీరు సల్లగుండాలే……