Rayini Matram Kante Song Lyrics penned by Vennelakanti, music composed by Himesh Reshammiya, and sung by Hariharan from Telugu cinema ‘Dhasavathaaram‘.
Rayini Matram Kante Song Credits
Dhasaavathaaram Movie Released Date – 13 June 2008 | |
Director | K.S.Ravikumar |
Producer | V. Ravichandran |
Singers | Hariharan & Kamal Haasan |
Music | Himesh Reshammiya |
Lyrics | Vennelakanti |
Star Cast | Kamal Haasan, Asin, Mallika Sherawat |
Music Label |
Rayini Matram Kante Song Lyrics in English
Om Namo Naarayanaaya
Rayini Matram Kante Devudu Kanaradu
Devuni Matram Kante Deham Kanaraadhu
Raayini Maathram Kante Devudu Kanaraadu
Devuni Maathram Kante Deham Kanaraadhu
Harini Talachu Naa Hrudayam Nedu
Haruni Thalachuta Jaragadhule
Ashta Aksharam Telisina Noru
Pancha Aksharam Palakadhule
Vankara Kannula Meeru Sankara Kinkarula
Vaishnavunem Chesthaaru Aa Yama Kinkarulu
Niluvu Naamam Daalchu Thalanu
Meeku Vanchanule
Niluvunaa Nanu Cheelchuthunnaa
Maata Maarchanule
Niluvu Naamam Daalchu Thalanu
Meeku Vanchanule
Niluvunaa Nanu Cheelchuthunnaa
Maata Maarchanule
Veera Shaivula Bedirimpulaku
Parama Vaishnavam Aagadhule
Prabhuvu Aanathiki Jadise Naadu
Padamata Sooryudu Podavadule
Raajya Lakshmi Naadhudu Sreenivasude
Srinivasudi Vaarasudee Vishnudaasude
Deshaannele Vaarantha Raajya Raasule
Raachalaku Raaju Ee Rangaraajane
Neetilona Munchinantha Neethi Chaavadhule
Gundelona Velugunu Nimpe Jyothi Aaradhule
Neetilona Munchinantha Neethi Chaavadhule
Gundelona Velugunu Nimpe Jyothi Aaradhule
Divvelanaarpe Sudigaali
Vennela Velugunu Aarpenaa
Nelanu Munche Jadivaana
Aakaashaanni Thadipenaa
Shaivam Okkate Maathram Daivam Kadhantaa
Daivam Kosam Pore Samayam Ledhanta
Raayini Maathram Kante Devudu Kanaraadu
Devuni Maathram Kante Deham Kanaraadhu
Watch రాయిని మాత్రం కంటే Video Song
Rayini Matram Kante Song Lyrics in Telugu
ఓం..! నమో నారాయణాయ
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
హరిని తలచు నా హృదయం నేడు
హరుని తలచుట జరగదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు
పంచ అక్షరం పలకదులే
వంకర కన్నుల మీరు… శంకర కింకరులూ
వైష్ణవునేం చేస్తారు… ఆ యమ కింకరులూ
నిలువు నామం దాల్చు తలనూ
మీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా
మాట మార్చనులే
నిలువు నామం దాల్చు తలనూ
మీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా
మాట మార్చనులే
వీర శైవుల బెదిరింపులకూ
పరమ వైష్ణవం ఆగదులే
ప్రభువు ఆనతికి జడిసే నాడు
పడమట సూర్యుడు పొడవడులే
రాజ్య లక్ష్మి నాధుడూ శ్రీనివాసుడే
శ్రీనీవాసుడి వారసుడీ విష్ణుదాసుడే
దేశాన్నేలే వారంతా రాజ్య రాసులే
రాచలకు రాజు ఈ రంగరాజనే
నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
దివ్వెలనార్పే సుడిగాలీ
వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలను ముంచే జడివాన
ఆకాశాన్నే తడిపేనా
శైవం ఒక్కటే మాత్రం… దైవం కాదంటా
దైవం కోసం పోరే… సమయం లేదంటా
రాయిని మాత్రం కంటే… దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే… దేహం కనరాదు