రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది రియల్‌మీ. లాక్‌డౌన్ వల్ల ఎప్పటి నుండో ఫోన్ లాంచింగ్ ను వాయిదా వేస్తూ వస్తున్న రియల్‌మీ ఎట్టకేలకు 5జీ కొత్త వేరియంట్‌ను విపణిలోకి విడుదల చేసింది కంపెనీ.
రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల
X50 సిరీస్‌లో విడుదలైన మూడవ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ. ‘రియల్‌మీ ఎక్స్50 5జీ’ మరియు ‘రియల్‌మీ ఎక్స్ 50 ప్రో 5 జి’ ఇది వరకు ఈ కంపెనీ నుండి వచ్చిన ఫోన్లు.
గురువారం ఈ ఫోన్ లో చైనాలో లాంచ్ చేశారు. గెలాక్సీ వైట్ మరియు స్టార్రి బ్లూ కలర్లలో విడుదలైన ‘రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ’ ఫోన్ ఏప్రిల్ 29 నుండి చైనాలో అమ్మకాలను ప్రారంభించనుంది రియల్‌మీ.
రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ కెమెరా వివరాలు
రియల్‌మీ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫోన్ కెమెరా వివరాలు. ఎఫ్ / 1.8 లెన్స్‌తో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 08 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-ఎఫ్ / 2.3 లెన్స్, టెలిఫోటో లెన్స్, 2.4 మాక్రో లెన్స్‌తో 2 ఎంపి మాక్రో సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 ఎంపి క్వాటర్నరీ మోనోక్రోమ్ సెన్సార్.
అలాగే రెండు సెల్ఫీ కెమెరాలు. 16 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్.
రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ’ ఫోన్ ధర ఇండియాలో
6 జీబీ ర్యామ్‌తో వచ్చే బేస్ మోడల్ ధర 1,999 యువాన్లు (సుమారు మన కరెన్సీలో రూ. 21,547/-) కాగా, 8 జీబీ ర్యామ్ టాప్ మోడల్ 2,299 యువాన్లు (సుమారు భారత కరెన్సీలో రూ. 24,787/-) కు అమ్ముడవుతోంది.
రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ ప్రత్యేకతలు
ఓఎస్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ
డిస్ ప్లే: 6.57 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ హోల్-పంచ్ డిస్‌ప్లే
ప్రాసెసర్: క్వాలకమ్ స్నాప్ డ్రాగన్ 765జి
ర్యామ్: 6 GB/ 8GB
మెమరీ: 128 GB
బ్యాటరి: 4200 mAh
వెనక కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరా: 16+2 మెగాపిక్సెల్
ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ: 30W Dart