సారే కావాలంటున్నరే సాంగ్ లిరిక్స్ బుర్ర సతీష్ అందించగా రవి కళ్యాణ్ సంగీతం సమకూర్చగా నర్సన్న-నల్గొండ గద్దర్ ఈ పాటను పాడారు.
సారే కావాలంటున్నరే సాంగ్ Credits
Singer | Narsanna-Nalgonda Gaddar |
Music | Ravi Kalyan |
Lyrics | Burra Sathish |
Song Source | BRS Party |
సారే కావాలంటున్నరే సాంగ్ లిరిక్స్
అహా, సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల
మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల
(సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల
మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల)
ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు
పండుగల్లే పల్లెకొచ్చినోడు
జనమంతా జైకొట్టి పలికేటి పేరు
జనము బిడ్డ మన కెసిఆర్…
సారే, మన సారే… చల్
సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల
మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల
ఏండ్ల నుండి ఎనకబాటు జూసిండు
ఎత్తుకున్నాడమ్మా గులాబీ జెండా
సావునోటిలోన తల పెట్టినాడు
స్వరాష్ట్ర పొద్దయ్యి వర్ధిల్లినాడు
(స్వరాష్ట్ర పొద్దయ్యి వర్ధిల్లినాడు)
పథకాలు ఎన్నో పంచినడమ్మా
ప్రజల గుండెల్లోన నిలిసినడమ్మా
రెండు వేలు ఇచ్చే పింఛను నేడు
అయిదు వేలకు పెంచుతనండు
(అయిదు వేలకు పెంచుతనండు)
కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రయ్యి
కట్నమిచ్చి కాళ్ళు కడిగిండయో
కేసిఆరే ప్రతి ఇంటికి ధీమా
అందించునే అయిదు లక్షల భీమా
సారే, మన సారే…
పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల
మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల
ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు
ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మా
రైతుబంధు రైతు భీమాను ఇచ్చిన
పెద్ద రైతు మన కేసిఆరు…
(పెద్ద రైతు మన కేసిఆరు)
ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మో
పంటపొలాలను తడిపినడమ్మా
మిషన్ కాకతీయతో ఊరి చెరువు
మత్తడి పారి తీర్చింది కరువు
(మత్తడి పారి తీర్చింది కరువు)
తొలగించినాడురా కంట నీళ్లు
ఇంటింటికి వచ్చే నల్ల నీళ్ళు
అభివృద్ధికి ఆయనే మారుపేరు
నీళ్లకాల సృష్టి కర్త కేసిఆరు…
సారే, బోల్ సారే… చల్
సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల
మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల
నిలువనీడ లేని నిరుపేదలకు
గృహలక్ష్మితో సాయం అందిచేనమ్మ
పెరిగిన ధరలకు అల్లాడుతున్న
బక్కచిక్కినోళ్ళ దిక్కైనాడు
(బక్కచిక్కినోళ్ళ దిక్కైనాడు)
నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్
అందిస్తానంటూ హామీ ఇచ్చిండు
మహిళా సమాఖ్యల సొంత భవనాలకు
మాటిచ్చినాడమ్మా మనసున్న నేతా
అడగకుండానే అన్ని చేసే
ఆత్మబంధువయ్యి మనల జూసే
బంగారు తెలంగాణ ఈ బాటసారి
గెలిపించుకుందాం మళ్ళొక్కసారి
సారే, మన సారే… చల్
సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల
మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల
దండి ధైర్యాన్నిచ్చే రా దళిత బంధు
గుండె నిబ్బరమాయే బీసీల బంధు
అగ్రవర్ణ పేదల విద్య కోసం
రెసిడెన్సియల్ స్కూల్లు కట్టిస్తనండు
(రెసిడెన్సియల్ స్కూల్లు కట్టిస్తనండు)
సాయమై వచ్చింది మైనార్టీ బంధు
ఉద్యోగ ఉపాధి ఐటీ టవర్స్
వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా
ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల
(ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల)
ప్రజల క్షేమమే కోరెనయో
సంక్షేమ పథకాల సర్కారయో
కష్టజీవుల సద్ది బువ్వయ్యినోడు
తెలంగాణ బతుకు తొవ్వయ్యినాడు
సారే, మన సారే… చల్
సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల
మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల
సన్నబియ్యంతోని కడుపులు నింపగ
అన్నపూర్ణ ఆ పథకం జూడు
ఉన్నత విద్యకు నిలయమయ్యిన
గురుకుల పాఠశాలలు నేడు
(గురుకుల పాఠశాలలు నేడు)
ఆడబిడ్డల ఆత్మగౌరవమాయే
మూడువేల తోని సౌభాగ్యలక్ష్మి
పదిహేను లక్షల ఆరోగ్య రక్ష
కేసీఆరే మనకు శ్రీరామ రక్ష
(కేసీఆరే మనకు శ్రీరామ రక్ష)
ప్రగతిలోన పరిగెత్తే కారు
పాలనకింకెవరు సాటిరారు
ప్రపంచ దేశాలే కొనియాడిన తీరు
మళ్ళీ రావాలె గులాబీ సర్కారు
సారే, మన సారే…
కేసీఆరే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల
మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల
సారే కావాలంటున్నరే Video సాంగ్