Sarah Telugu Musical Video Lyrics అందించిన వారు సందీప్ శాండిల్య, సంగీతం – బాలాజీ టేకి, పాడిన వారు అఖిల్ సంజోయ్. సమర్పణ శేఖర్ స్టూడియో.
Sarah Telugu Musical Video Lyrics
ఊపిరాగిపోయే చెలియా వినవే
నిన్ను మరువలేనే నేనే
ఊసుపోదు నాకే నువ్వే లేకా
ఊయలూపమాకే మదినే…
ఇన్నాళ్ళు నాలో నేనే లేనే
నీలోనే ఏకమైనానే
నాతోనే ఆటలాడినావే ప్రేమా
నువు లేని నేను నేను కాదే
నీతోనే మనసు నిండిపోయే
ఏదోలా కదిలి రావే నువ్వే…
ఇక నేనే నాతో మిగిలానా?
కను మూసేదాకా శిలనేనా?
ఊపిరాగిపోయే చెలియా వినవే
నిన్ను మరువలేనే నేనే.
తెలుసా నాలోనా… నీదేగా ధ్యాసా
తడబాటులో నువ్వు లేకా
అలకా నాపైనా… ఎంత కోపమైనా
నా నుండి వెళతావా, న్యాయమా?
ఇక రోజు నాతో నాకే యుద్ధమే
నిను చేరే దారే కోరే ప్రాణమే
హృదయమా హృదయమా
తిరిగి నాలో చేరవా
హృదయమా హృదయమా
ఎదురుకావే ప్రేమా..!
మనసా మరిచావా
మన ఊసులలోన ఒట్టేసి అనుకున్న మాటా
బహుశా కలనేనా… ఇపుడే లేచానా
నిజమయ్యే కధ నువ్వు కావా?
నువు లేని రోజే నాకేంటో చెలీ
ప్రతిసారి గాల్లో నీదే రూపమే
హృదయమా హృదయమా
తిరిగి నాలో చేరవా
హృదయమా హృదయమా
ఎదురుకావే ప్రేమా..!
ఊపిరాగిపోయే చెలియా వినవే
నిన్ను మరువలేనే నేనే..
ఊసుపోదు నాకే నువ్వే లేకా
ఊయలూపమాకే మదినే…
Watch ఊపిరాగిపోయే చెలియా Video Song
Also Read – Manasara Lyrics
Sarah Telugu Musical Video Lyrics Credits
Director | Bobby (M.N.Murthy) |
Producers | Shekher, Ravi Peetla |
Singer | Akhil Sanjoy |
Music | Balaji Teki |
Lyrics | Sandeep Sandilya |
Star Cast | Sri Satya & Eshwar Sai |
Video Label |