విలక్షణ నటుడు, నాచురల్ స్టార్ నాని నటించిన Saripodhaa Sanivaaram చిత్రం ఈ రోజు (29 ఆగష్టు)న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైన్ గా వచ్చిన ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నాని పక్కన నటించారు. ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించారు.
తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ చిత్రం, అన్ని భాషల్లో కలిపి 41 కోట్లకు అమ్మారు. ‘హాయ్ నాన్న’ సక్సెస్ అందుకున్న నాని ఈ చిత్రం విజయంపై అంచనాలు పెట్టుకున్నాడు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో నాని చిత్ర యూనిట్ తో కలిసి ప్రేక్షకుల నడుమచిత్రాన్ని వీక్షించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ‘Suryas Saturday’ టైటిల్‌తో ఇతర భాషల్లో విడుదలైంది.