శార్వరి నామ సంవత్సరం అంటే ఏమిటి
మన దగ్గర చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఉగాది పండగ తెలుగు నూతన సంవత్సరాదికి ఈసారి ‘శార్వరి నామ సంవత్సరం’ గా పిలుస్తారు. మరి దీనికి అర్థం ఏంటో చూద్దాం.
అగ్ని పురాణంలో ఉన్న 60 సంవత్సరాలలో దానిలో 34వ సంవత్సరమే శార్వరి నామ సంవత్సరం. ఈ శార్వరి నామ సంవత్సరం కర్కాటక లగ్నమందు చైత్ర శుక్ల పాఢ్యమి ప్రవేశ సమయం 24 మార్చి 2020న 02:58 నిమిషములకు ప్రవేశించింది.
ఉగాది బుధవారం నాడు వచ్చింది కాబట్టి రాజు బుధుడు అయ్యాడు. రాజు బుధుడు కావడం వాళ్ళ వర్షాలు బాగానే పడతాయి, మంత్రి చంద్రుడు అవడం వల్ల అన్ని రకాల పంటలు పండుతాయి, సేనాధిపతి రవి కావడం వల్ల ప్రజలు క్షేమంగా ఉంటారు. ఉగాది పంచాంగ శ్రవణంలో చెప్పారు.
శార్వరి నామ సంవత్సరం అంటే ఏమిటి?
ఈ సంవత్సరం 384 రోజులు. ఆశ్వయుజ మాసం ఒకటి అధికమాసం రావడం వల్ల 13 మాసాలు రావడం జరిగింది.
శార్వరి అనగా రాత్రి స్వరూపమైన దుర్గ మాత అని ‘శబ్దార్థ కల్ప ధ్రువం’ అనే నిఘంటువులో ఉంది. అమ్మ వారి స్వరూపమే ఈ సంవత్సర నామధేయమని పండితులు చెప్తున్నారు. సూర్య నారాయణుడి శక్తిని మరియు నక్షత్రములు లేని రాత్రిని కూడా శార్వరి అంటారని చెప్పారు. ఈ శార్వరి నామ సంవత్సరానికి దేవత సూర్య నారాయణుడు.