SILAKA 2 FOLK SONG LYRICS – Silaka Female Version

SILAKA 2 FOLK SONG LYRICS
Pic Credit: VR Talkies (YouTube)

Silaka 2 Folk Song Lyrics penned by Still Vijay, music composed by Ramesh, and sung by Laxmi. Silaka Folk Song 2 featuring Still Vijay & Smiley Lasya.

Silaka 2 Folk Song Credits

Song Category Telangana Folk Song
Director Suresh Suriya
Cast Lasya Smiley, Still Vijay
Lyrics Still Vijay
Singer Laxmi
Music Ramesh
Music Lable & Credit

Silaka 2 Folk Song Lyrics in English

Sirimalle Thotallo Sinnanga Pothunte
Silako Naa Rama Silaka
Vaani Sirunavvu Choosaka
Naa Sinni Gundello Molisindile Prema Molaka

Marumalle Thotallo GiraGira Thirigeti
Silako Naa Rama Silaka
Vaadu Arakora Soopulatho Ardhame Kaadamma
Silako Naa Rama Silaka

Silako Naa Rama Silako
Vaani Soopullo Matthundhi Ganako
Aa Matthullo Padi Nenu Sitthaipoyaanu

Sirimalle Thotalla, Aaha
Sirimalle Thotalla Sinnanga Pothunte
Silako Naa Rama Silaka
Vaani Sirunavvu Choosaka
Naa Sinni Gundello Molisindile Prema Molaka

Watch సిలకో నా రామ సిలక Female Version Video Song

Silaka 2 Folk Song Lyrics in Telugu

సిరిమల్లె తోటల్లొ సిన్నంగ పోతుంటే
సిలకో నా రామ సిలక
వాని సిరునవ్వు చూసాక
నా సిన్ని గుండెల్లో మొలిసిందిలే ప్రేమ మొలక

మరుమల్లె తోటల్లో గిరగిర తిరిగేటి
సిలకో నా రామ సిలక
వాడు అరకొర సూపులతో అర్ధమే కాడమ్మ
సిలకో నా రామ సిలక

సిలకో నా రామ సిలకో
వాని సూపుల్లో మత్తుంది గనకో
ఆ మత్తుల్లో పడి నేను సిత్తైపోయాను

సిరిమల్లె తోటల్ల, ఆహా
సిరిమల్లె తోటల్ల సిన్నంగ పోతుంటే
సిలకో నా రామ సిలక
వాని సిరునవ్వు చూసాక
నా సిన్ని గుండెల్లో మొలిసిందిలే ప్రేమ మొలక

మందార పువ్వుల్లో మకరందమోలున్న
సిలకో నా రామ సిలక
నా అందచందాలన్న ఆరగించడేమో
సిలకో నా రామ సిలక

సందెకాడ పూసే సింధూర పువ్వులు
సిలకో నా రామ సిలక
నుదుట సింధూరమై వాడు రానన్న రాడేమే
సిలకో నా రామ సిలక

సిలకో నా రామ సిలకో
వాడు సిన్నోడు కాదమ్మ సిలకో
నా సన్నాని నడుముళ్ళ
సన్నాయిలూదాడు
సిరిమల్లె తోటల్ల, ఆహా

కనకాంబరం లాంటి కన్నె పిల్లను నేను
సిలకో నా రామసిలక
నన్ను కళ్యాణమాడగ వరుడై రాడేమె
సిలకో నా రామసిలక

చామంతి పువ్వంటి ఛాయ కల్గిందాన్ని
సిలకో నా రామ సిలక
నాకు సీమంతమయ్యేటి భాగ్యమన్నియ్యడే
సిలకో నా రామ సిలక

సిలకో నా రామ సిలకో
వాడు నడకల్లో నటరాజు గనకో
వాని అడుగుల్లో అడుగేసి
కడదాక తోడుంట

సిరిమల్లె తోటల్ల, అర్రె
సిరిమల్లె తోటల్ల సిన్నంగ పోతుంటే
సిలకో నా రామ సిలక
వాని సిరునవ్వు చూసాక
నా సిన్ని గుండెల్లో మొలిసిందిలే ప్రేమ మొలక

ఆ, అల్లిపూల నడుమ మెల్లంగ పోతుంటే
సిలకో నా రామసిలక
వాన్ని అల్లుకుందామంటే ఎల్లిపోయినాడమ్మ
సిలకో నా రామ సిలక

నల్లగున్నగాని నా బావ మంచోడు
సిలకో నా రామ సిలక
నల్లపూసలు అల్లి మెళ్ళో ఏస్తున్నాడు
సిలకో నా రామ సిలక
నల్లపూసలు అల్లి మెళ్ళో ఏస్తున్నాడు
సిలకో నా రామ సిలక
నల్లపూసలు అల్లి మెళ్ళో ఏస్తున్నాడు
సిలకో నా రామ సిలక, ఆహా