Situkesthe Poye Pranam Song Part 2 Lyrics – Ganu Folks

Situkesthe Poye Pranam Song Part 2 Lyrics

Situkesthe Poye Pranam Song Part 2 Lyrics penned by Ganu, sung by Madhu Priya & Hanmanth Yadav, and music composed by Madeen SK.

Situkesthe Poye Pranam Song Part 2 Song Credits

Song CategoryTelangana Folk Song
DirectorSumanth
ProducerBaira Dev Yadav, Rajitha Konreddy
LyricsGanu
SingersMadhu Priya & Hanmanth Yadav
MusicMadeen SK
Song Lable

Situkesthe Poye Pranam Song Part 2 Lyrics in English

Yemulada Rajanna Devunni Aduge
Nee Meedhunna Ittam
Kondagattu Anjanna Swamyni Mokkinaane
Neeku Raavoddhu Kattam

Watch సిటికేత్తే పోయే పాణం Video Song


Situkesthe Poye Pranam Song Part 2 Lyrics in Telugu

ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్నసామిని మొక్కిననే
నీకు రావద్దు కట్టం

సిటికేత్తే పొయ్యేటి పాణానికి
ప్రేమ సిక్కులు వెట్టినవేందే
బండ తీరుగుండేటి నా గుండెకు
ఇన్ని భాధలు వెడుతున్నావేందే

ఆ దేవుణి మీద మన్నుపొయ్య
నీ ప్రేమకు బాకీ లేదేందే
బువ్వ తింటే టెన్ టు ఫైవ్ పోతలేదే
నీ మీదే పాణమాయే
నువ్వు నా తోడు లేకపాయే
నాకు సావన్న రాకపాయే

ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్న సామిని మొక్కిననే
నీకు రావద్దు కట్టం

నీ మెడలోన మూడు ముళ్ళేసి
వందేళ్లు నీతోనే ఉంటన్నగానీ
నీ మెడలోన మూడు ముళ్ళేసి
వందేళ్లు నీతోనే ఉంటన్నగానీ

నీ తలమీద కుంకుమనయ్యి
సావుల తోడొస్తనన్నానుగానీ
మాటను తప్పిన మన్నించవే
నిన్ను ఇడిసివెట్టి ఎళ్ళిపోతున్ననే
ఆ దేవుణి మీద మన్నుపొయ్య
నీ ప్రేమకు టెన్ టు ఫైవ్ బాకీ లేదేందే

నేను లేకుంటే ఎట్లుంటవే
మల్ల రానంటే ఏమైతవే
నేను లేకుంటే ఎట్లుంటవే
మల్ల రానంటే ఏమైతవే
ఆ కండ్లు లేని దేవుడే
నిన్ను నన్నూ ఎడబాపెనే

ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్నస్వామిని మొక్కిననే
నీకు రావద్దు కట్టం

దూరమైతున్ననే పిల్ల నీకు
నిన్ను సూడాలనుందే నాకు
దూరమైతున్ననే పిల్ల నీకు
నువ్వంటే సచ్చేంత ప్రేమనే నాకు
దూరమైతున్ననే పిల్ల నీకు
నీతోనే బతుకాలని ఉందే నాకు

బతుకంతా నీతోనే అనుకున్ననే
ఏడు జన్మాలు నీతోనే కలగన్ననే
నా బతుకంతా నీతోనే అనుకున్ననే
బ్రహ్మ రాతలాగా గీత ఇంతేనే

నేను లేకుంటే ఎట్లుంటవే
మల్ల రానంటే ఏమైతవే
నేను లేకుంటే ఎట్లుంటవే
మల్ల రానంటే ఏమైతవే
ఆ కండ్లు లేని దేవుడే
నిన్ను నన్నూ ఎడబాపెనే

ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్నస్వామిని మొక్కిననే
నీకు రావద్దు కట్టం

నేను పుట్టిన నా ఈ మట్టికైనా
పాణాలు ఇచ్చేటి రోజొచ్చెనే
నేను సత్తే గర్వంగా జెప్పుకోయే
భారత జెండాను గుండెలగత్తుకోయే

అన్నాన్ని వెట్టేటి రైతన్నకే
ఆకలితో సావు వచ్చినట్టు
భరతమాత తల్లి కోసమంటూ
కొట్లాడుతూ పానమిచ్చినట్టు

నిలిసిపోతానే మీ గుండెలా
కలిసిపోతున్న ఈ మట్టిలా
సల్లగుండే నువ్వక్కడా
సచ్చిపోతున్న నేనిక్కడా

నువ్వు లేకుంటే ఎట్లుంటనే
మల్ల రానంటే ఏమైతనే
ఆ కళ్ళు లేని దేవుడే
నిన్ను నన్నూ ఎడబాపెనే