Sri Plava Nama Samvatsara Rasi Phalalu – శ్రీ ప్లవ నామ సంవత్సర రాశి ఫలితాలు 2021-22

0
Sri Plava Nama Samvatsara Rasi Phalalu

Sri Plava Nama Samvatsara Rasi Phalalu

సమస్త తెలుగు ప్రజానికానికి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి శుభములు చేకూరాలని కోరుకుంటూ ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. శార్వరి నామ సంవత్సరం ముగించుకొని ప్లవ నామ సంవత్సరంలోకి అడుగెట్టాము.

ఉగాది పర్వదినాన లక్ష్మి, సరస్వతి మరియు గణపతి దేవుళ్ళు ఉన్న చిత్రపటానికి పూజలు చేస్తుంటారు. నీటి వనరులు బాగా సమృద్ధిగా ఇచ్చే సంవత్సరమే ఈ ప్లవ నామ సంవత్సరం.

Sri Plava Nama Samvatsara Rasi Phalalu Check Below

1. మేష రాశి ఫలాలు (Mesha Rasi – Aries Horoscope) 2021 – 22

ఆదాయం – 08 వ్యయం – 14 రాజపూజ్యం – 04 అవమానం – 03
  • ఈ సంవత్సరానికి మేషానికి అధిపతి కుజుడే రాజు, అంతగా అపకారాలు చేసే అవకాశం లేదు, అలా అని ఉపకారాలు కూడా ఎక్కువగా చేయడు.
  • మేష రాశి వారికి ఆదాయం కొంత తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉంటుంది.
  • వ్యాపార కార్యాకలాపాలు చేసే వారికి గత సంవత్సరంతో మెరుగ్గా ఉంటుంది.
  • విద్యార్థులు శ్రమించాలి, తప్పదు.
  • ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు మాట తీరు బాగుండాలి. అప్పుడే ఆ పనిని పూర్తిచేయగలరు.
  • ధార్మిక కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది.
  • గతంలో ఆగిపోయిన పనులు ఈ సంవత్సరంలో పూర్తి చేసుకోగలరు.
  • ఉద్యోగులకు స్థానచలనం ఉండొచ్చు.
  • నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశం.
  • రైతుకు మరింత అనుకూలంగా ఉంటుంది.
  • ఈ రాశి స్త్రీలకు యోగ్యదాయకంగా ఉంటుంది. ఉపయోగపడే విలువైన వస్తువులు కొంటారు.
  • దంపతులు అన్యోన్యంగా ఉంటారు.
  • ఆరోగ్య సమస్యలు అంతగా బాధించవు.
  • కంది ధాన్యాలు దానం చేయడం, మంగళవారం ఉపవాసం ఉండడం మంచిది.

2. వృషభ రాశి ఫలాలు (Vrushabha Rasi – Taurus Horoscope) 2021 – 22

ఆదాయం – 02 వ్యయం – 08 రాజపూజ్యం – 07 అవమానం – 03
  • వృషభ రాశి వారికి ఆదాయం తక్కువ ఉందని చింత అనవసరం. కొత్తగా ఇల్లు లాంటివి కొనే అవకాశం ఉంది.
  • కళారంగంలో ఉన్న స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
  • విద్య విషయంలో స్థాయిని మించి ఖర్చు ఉంటుంది.
  • పనిని వాయిదా వేయడం, నిర్లక్ష్యం చేయకూడదు.
  • ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  • కొన్ని సమస్యలు మానసిక వ్యధను కలిగించవచ్చు.
  • భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.
  • దానం, గోసేవ, పూజలు చేయడంతో పాటు తెల్లని వస్తువులు దానం చేయడం మంచిది.

3. మిథున రాశి ఫలాలు (Mithuna Rasi – Gemini Horoscope) 2021 – 22

ఆదాయం – 05 వ్యయం – 05 రాజపూజ్యం – 03 అవమానం – 06
  • మిథున రాశి వారికి సమాజంలో ఏంటో నిరూపించుకుంటారు.
  • శత్రు వర్గంతో ఇబ్బంది ఏర్పడిన వాటిని అధిగమిస్తారు.
  • స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. దగ్గరగా ఉంటూ మీకు నష్టం చేకూర్చుతారు.
  • దైవ బలం బాగా ఉండాలి.
  • కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
  • చదువుకు సంబంధంలేని ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది, తప్పదు.
  • దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్త తప్పదు.
  • అప్పు ఇవ్వడం, తీసుకోవడం కలిసి రాదు.
  • పనికిమాలిన విషయాల మీద శ్రద్ధ అనవసరం.
  • ఉద్యోగులకు జీవనం సాఫీగా సాగుతుంది.
  • కళాకారులకు కొంత ప్రతికూలం.
  • భాగస్వామ్య వ్యాపారం బాగుంటుంది.
  • ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడితే మంచిది.

4. కర్కాటక రాశి ఫలాలు (Karkataka Rasi – Cancer Horoscope) 2021 – 22

ఆదాయం – 14 వ్యయం – 02 రాజపూజ్యం – 06 అవమానం – 06
  • ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీ జీవిత ఆశయం నెరవేర్చుకోవడానికి చేసే కృషి అమోఘం.
  • వివాద రహిత వ్యక్తిగా ఉంటారు.
  • ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఋణం కొంత వరకు వసూలు చేసుకుంటారు. అప్పులు తీర్చుతారు.
  • మీ మీద చెడు ప్రచారం చేసే వారి వళ్ళ మీకు ఎలాంటి ముప్పు లేదు.
  • నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెండు.
  • సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తారు.
  • పెళ్లి వంటి శుభకార్యాలు జరగవచ్చు.
  • కుటుంబ వ్యవహారాల్లో ఈ రాశి వారిదే పెత్తనం.
  • రాజకీయ నాయకులకు అత్యంత అనుకూలం ఈ సంవత్సరం.
  • వ్యాపారులు రాణిస్తారు.
  • విద్యార్థులు నిర్లక్ష్యం వహిస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి.
  • విడాకులు కోరే వారికి కలిసి వస్తుంది.

5. సింహ రాశి ఫలాలు (Simha Rasi – Leo Horoscope) 2021 – 22

ఆదాయం – 02 వ్యయం – 14 రాజపూజ్యం – 02 అవమానం – 02
  • ఈ రాశి వారు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు.
  • స్థిరాస్తులను అమ్మే ఆలోచన వస్తుంది.
  • తెలియకుండానే శత్రువులు తారసపడతారు.
  • మనవారే కదా అన్ని విషయాలు పంచుకుంటారు, అది మంచిది కాదు.
  • అప్పులు ఇవ్వడం మంచిది కాదు.
  • ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
  • చిన్న చిన్న ఆరోగ్య సమస్యల మూలంగా కొంత ప్రశాంతత కొరవడుతోంది.
  • అధికారుల మన్ననలు పొందడమే కాక, ప్రమోషన్ తో కూడిన బదిలీలు పొందుతారు.
  • ప్రైవేట్ ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది.
  • కళాకారులకు అనుకున్నవి సాధిస్తారు.
  • విద్యార్థుల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఎంట్రన్స్ పరీక్షలో విజయం సాధిస్తారు.
  • స్త్రీలకు అత్యంత అనుకూల రాశి.

6. కన్యా రాశి ఫలాలు (Kanya Rasi – Virgo Horoscope) 2021 – 22

ఆదాయం – 05 వ్యయం – 05 రాజపూజ్యం – 05 అవమానం – 02
  • ఉపన్యాసాలు, ప్రసంగాల ద్వారా పలువురి ప్రశంశలు పొందుతారు.
  • శత్రువులు ఈ రాశి వారిని అంచనా వేయడంలో తప్పటడుగులు తప్పవు.
  • ఉన్న అనారోగ్యాలు తొలగి మనసు కుదుట పడుతుంది.
  • బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.
  • నిర్మాణ పనుల్లో జాప్యంతో ముందుకు సాగుతుంది.
  • విలువైన బంగారం, వెండి ఆభరణాలు, స్థిరాస్తులను కొనే అవకాశం ఉంది.
  • ఉద్యోగస్తులు తమ భాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు. పై అధికారులు మీ మాటలు వింటారు.
  • నిరుద్యోగులకు పలు అవకాశాలు లభిస్తాయి.
  • రైతులకు కలిసి వచ్చే సంవత్సరం ఇది.
  • భాగస్వాములతో చేసే వ్యాపారులకు కలిసి వస్తుంది.
  • విద్యార్థులకు మంచి మార్కులు వచ్చే అవకాశం.
  • మహిళల మాటలకు ఎదురు లేదు.
  • వివాహ ప్రయత్నాలు మంచి ఫలితాలు కలుగును.
  • జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా జాగ్రత్తగా ఉంటె మంచిది.

7. తుల రాశి ఫలాలు (Tula Rasi – Libra Horoscope) 2021 – 22

ఆదాయం – 02 వ్యయం – 08 రాజపూజ్యం – 01 అవమానం – 05
  • తుల రాశి వారు ఆచి తూచి మాట్లాడడం మంచిది.
  • నూతన పంథాలో జీవనం సాగించాలి అనుకుంటారు. ఉమ్మడి కుటుంబంలో ఉంటే జాగ్రత్తగా మసలుకోవాలి.
  • తల్లితండ్రుల మీద మమకారం ఉంటుంది.
  • దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను తీర్చుకుంటారు.
  • ఆస్తులను, విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవడం అవసరం.
  • కొన్ని శుభకార్యాలు చేయడం ద్వారా మీ బరువులు కొన్ని దించుకుంటారు.
  • ఆర్థికంగా కొంత ప్రతికూలంగా ఉంటుంది. అప్పులు చేసే అవకాశం ఉంటుంది.
  • నిరుద్యోగులు కాస్త కష్టపడాలి ఉద్యోగాల కోసం.
  • వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి.
  • రైతులకు రెండు పంటలు బాగా పండినా, కొంత దిగుబడి తగ్గొచ్చు. నష్టం ఉండదు.
  • విద్యార్థులకు కోరుకునే కాలేజీలో సీటు దొరుకును.
  • స్నేహితులు జోలికి వెళ్లకుండా తల్లితండ్రుల మాట వినడం మంచిది.
  • మహిళలు చదువుకు తగిన ఉద్యోగం పొందుతారు.
  • గృహనిర్మాణ యోగం ఉంటుంది.
  • సమస్యలు ధైర్యంగా ఎదురుకుంటారు.
  • ఆరోగ్య విషయాల మీద దృష్టి పెట్టాలి.

8. వృశ్చిక రాశి ఫలాలు (Vruchika Rasi – Scorpio Horoscope) 2021 – 22

ఆదాయం – 08 వ్యయం – 14 రాజపూజ్యం – 04 అవమానం – 05
  • వృశ్చిక రాశి వారు పనులన్నీ పట్టుదలతో చేస్తారు.
  • శత్రువులను కూడా ప్రసన్నం చేసుకొని పనులు చేసుకుంటారు.
  • ఇతరుల సలహాలను పాటించి తగు ఫలితాలు పొందుతారు.
  • అవమానాలు ఎదురైనా పని కోసం వాటిని లెక్క చేయరు.
  • లోపాలను సరిదిద్దుకుంటారు. ఇది మంచి ప్రక్రియ.
  • ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి పెడతారు.
  • వాహనాలు నడిపే ముందు జాగ్రత్త అవసరం.
  • కొందరికి స్థాన చలనం ఉంటుంది. వ్యాపారాలు కూడా.
  • ఆరోగ్య విషయాల మీద తగు శ్రద్ధ అవసరం. సంవత్సర ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు తగ్గవచ్చు.
  • ఉద్యోగులకు మానసిక సంతృప్తి ఉండకపోవచ్చు.
  • భార్యాభర్తలు సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. అంతేకాని ఇతరులకు మీ బాధలు చెప్పుకుంటే అవి మిమ్ముల్ని బాధిస్తాయి.
  • దూర ప్రయాణాలు ఉంటాయి.
  • వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.
  • వ్యవసాయదారులకు యోగవంతమైన కాలం, చిన్న చిన్న ఇబ్బందులు తప్ప.
  • విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకుంటారు.
  • మహిళలకు, కుటుంబంలో మీ పట్ల ప్రేమతో ఉంటారు.

9. ధనస్సు (ధనూ) రాశి ఫలాలు (Dhanassu Rasi – Sagittarius Horoscope) 2021 – 22

ఆదాయం – 11 వ్యయం – 05 రాజపూజ్యం – 07 అవమానం – 05
  • చాలా కష్టాలు పడి ఉన్న మీకు వాటి నుండి విముక్తి కలుగుతుంది.
  • అద్భుతమైన మంచి ఫలితాలు వీరికి ఈ సంవత్సరం సొంతం.
  • ఏదైనా పని చేయడానికి ముందు అన్ని రకాలుగా ఆలోచించి ముందు వెళ్తారు.
  • ధార్మిక కార్యక్రమాలు చాలా చెందుతారు.
  • అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.
  • సోదరుల నుండి మీకు సహాయం అందును.
  • మీ చొరవతో మీ బంధుగణంలో ఉన్న సమస్యలను తొలగిస్తారు.
  • మహిళలతో గొడవ పడే అవకాశం ఉంటుంది, కావున జాగ్రత్త అవసరం.
  • మీరు వాహనం నడపడం కంటే వేరే వారికి ఇవ్వడం మంచిది.
  • సంతానానికి కొద్దిగా ఖర్చు పెడతారు.
  • ప్రత్యేక శ్రద్ధ అవసరం ఆరోగ్య విషయంలో.
  • సహా ఉద్యోగులు చేసిన నిందలు తొలిగి మంచి పేరు తెచ్చుకుంటారు.
  • రైతులకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
  • నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

10. మకర రాశి ఫలాలు (Makara Rasi – Capricorn Horoscope) 2021 – 22

ఆదాయం – 14 వ్యయం – 14 రాజపూజ్యం – 03 అవమానం – 01
  • ఈ రాశి వారు సంబంధం లేని విషయాలను అస్సలు పట్టించుకోరు.
  • ఎంత ఒదిగి ఉంటె అంత ఎదుగుతారు.
  • వ్యసనాల వల్ల చెడు పేరు రాకుండా చూసుకుంటే మంచిది.
  • అవసరానికి డబ్బు అందుతుంది.
  • నిర్మాణ సంబంధించిన విషయాలు కొంత మెల్లగా సాగవచ్చు.
  • వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు.
  • అన్య స్త్రీలతో అక్కరకురాని గొడవలకు దూరంగా ఉండాలి.
  • దైవాన్ని మనసులో సంకోచించకూడదు.
  • ఆరోగ్యానికి కొంత డబ్బు ఖర్చు పెడతారు.
  • కోర్టు విషయాల్లో తలనొప్పి తప్పదు.
  • ఉద్యోగులు ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టకుండా పని మీద శ్రద్ధ పెట్టాలి. లేకుంటే నిరాశ తప్పదు.
  • వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి.
  • రైతు నష్టపోనప్పటికీ మంచి లాభాలే వస్తాయి.
  • విద్యార్థులకు కలిసి వచ్చే సంత్సరం.
  • నూతన వాహన యోగం ఉంది స్త్రీలకు.

11. కుంభ రాశి ఫలాలు (Kumbha Rasi – Aquarius Horoscope) 2021 – 22 … Sri Plava Nama Samvatsara Rasi Phalalu.

ఆదాయం – 14 వ్యయం – 14 రాజపూజ్యం – 06 అవమానం – 01
  • ఈ రాశి వారు పలు ప్రయాణాలు చేస్తుంటారు.
  • ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి రావచ్చు.
  • గతంలో చేసిన పనుల వల్ల ఇప్పుడు ఇబ్బంది పడతారు.
  • వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం.
  • ఆరోగ్య విషయాల మీద చాలా వరకు దృష్టి పెట్టాలి.
  • వడ్డీలు బాధించ వచ్చును.
  • రాజకీయ నాయకులు కలిసి వస్తుంది.
  • విద్యార్థులకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది.
  • వ్యాపారస్తులకు క్రితంతో పోల్చుకుంటే కొంత లాభ శాతం తగ్గొచ్చు.
  • ఉద్యోగస్తులకు సామాన్యమైన ఫలితాలు ఉంటాయి.
  • ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
  • మాట తీరుతో కొన్ని ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు.
  • విద్యార్థులకు చదువు పట్ల కొంత శ్రద్ధ కొరవడుతోంది.

12. మీన రాశి ఫలాలు (Meena Rasi – Pisces Horoscope) 2021 – 22

ఆదాయం – 11 వ్యయం – 05 రాజపూజ్యం – 02 అవమానం – 04
  • మీరు చేసే పనులు ఇతరులకు నచ్చకపోవచ్చు. చేసే పనులు సత్సంకల్పంతో చేస్తారు. అందుకే అవమానిస్తారు.
  • ఇతరులు అవమానించిన ఆశీస్సులుగానే భావిస్తారు.
  • ప్లవ నామ సంవత్సరం వీరికి బాగా కలిసి వస్తుంది.
  • ఇల్లు, ఆభరణాలు కొంటారు.
  • ఈ రాశి వారికి విద్యకు సంబంధించిన విషయాల్లో తిరుగుండదు.
  • వివాహం కానీ అమ్మాయిలకు ఈ సంవత్సరం అనుకూలం.
  • సుఖసంతోషాలు కలగడమే కాక, శుభకార్యాలు చేస్తారు.
  • వ్యయ లాభం కలుగుతుంది.
  • సంతాన రీత్యా సంతోషాలు కలుగుతాయి.
  • ఆరోగ్య సమస్యలు తొలిగిపోయి అవకాశాలు చాలా ఎక్కువ.
  • విద్యార్థులు తము కోరుకున్న విధంగా జరుగుతుంది.
  • వ్యాపారులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
  • ఉద్యోగస్తులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది.
  • నూతన వాహన యోగం ఉంటుంది.
  • రెండు పంటలు అద్భుతంగా పండుతాయి.
Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here