Swapna Sundari Song Lyrics penned by Rehman, music composed by Prashanth R Vihari, and sung by Damini Bhatla from Aha ‘Bhamakalapam 2‘, song ft. Seerat Kapoor.
Swapna Sundari Song Credits
Bhamakalapam 2 Telugu Aha Web Series | |
Director | Abhimanyu |
Producers | Bapineedu, Sudheer |
Singer | Damini Bhatla |
Music | Prashanth R Vihari |
Lyrics | Rahman |
Star Cast | Priyamani |
Music Label |
Swapna Sundari Song Lyrics in English
Andhaanni Ekkupetti Vetakostha
Aapedhi Evvadantaa
Rajadhi Rajulaina Longipoye
Mantram Naa Sonthamanta
Kannepilla Kallathoti
Kallemesthe Daasoham
Avvakunda Undagaladaa
Evvadainaa….
Manasulona Edho Marmamantu Leni
Musuguleni Manish Evadu Leduraa
Samayamosthegaani Bayatapadadhuleraa
Edho Asalu Nakili
Watch స్వప్నసుందరి Video Song
Swapna Sundari Song Lyrics in Telugu
అందాన్ని ఎక్కుపెట్టి వేటకొస్త
ఆపేది ఎవ్వడంటా
రాజాధి రాజులైన లొంగిపోయే
మంత్రం నా సొంతమంటా
కన్నెపిల్ల కళ్ళతోటి
కళ్లెమేస్తే దాసోహం
అవ్వకుండా ఉండగలడా
ఎవ్వడైనా…
మనసులోన ఏదో
మర్మమంటూ లేని
ముసుగులేని మనిషి ఎవడు లేడురా
సమయమొస్తేగాని బయటపడదులేరా
ఏదో అసలు నకిలీ
ఈ స్వప్నసుందరీ సరాసరి
నీ ముందరుంది చూసుకో మరి
తెల్లవారితే ఈ రాతిరి
ఇంకొక్కసారి రాదు ఈ సిరీ
స్వప్నసుందరీ…
పైపైన చూసేదంతా
నమ్మేస్తే ఎలా..?
లోలోనా దాగుందంతా
ముంచేసే అలా
కళ్ళతోటి కాదు
మనస్సుతోటి చూడు
ఏ కళ్ళలోన ఎంత లోతు ఉన్నదో
మసక మసకవేళ ఆచి తూచి ఆడు
ఏ అడుగు వేస్తే ఏమి వ్యూహమున్నదో
ఈ ఆటలో ఓ ఓ,
ఈ ఆటలో… ఈ వేటలో
నువ్వేమిటో నువ్వు తేల్చుకో
ఏ నవ్వులో ఏమున్నదో
ఏదో నలుపు తెలుపు
ఈ ఆశ వ్యామోహం
ఈ స్వార్ధం అంతా సహజం
నువ్వు నేను సమస్తం
అంతా ఓ మాయాజాలం
ఎక్కడం తొక్కడం
అదే కదా బతకడం
ఇదే సత్యం ఇదే నిత్యం
ఇదే కలాపం
ఈ స్వప్నసుందరీ సరాసరి
నీ ముందరుంది చూసుకో మరి
ఒక్కరాతిరి నీదేరా
స్వప్నసుందరీ
స్వప్నసుందరీ
స్వప్నసుందరీ